మంచి జోరు మీద ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. వరుస హిట్లతో సందడిచేస్తూ.. వస్తున్న వరుణ్ తే(Varuntej)జ్.. గని సినిమాతో.. డిజాస్టర్ ఫేస్ చేశాడు వరుణ్. ఇక ఈసారి ఎలాగైనా సూపర్ సక్సెస్ అందుకోవాలని ఆరాటంలో ఉన్నాడు మెగా ప్రిన్స్(Mega Prince). అయితే మెగా హీరోల్లో వరుణ్ తేజ్ కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తుంటాడు. సక్సెస్ ఫెయిల్యూర్ కు సబంధం లేకుండా.. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా ..

రిలీజ్ కు రెడీ అవుతున్నాడు గాంఢీవధారి అర్జున. సైలెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న మూవీ రిలీజ్ పై... తాజాగా అప్ డేట్ అందించారు మూవీ మేకర్స్.

మంచి జోరు మీద ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. వరుస హిట్లతో సందడిచేస్తూ.. వస్తున్న వరుణ్ తే(Varuntej)జ్.. గని సినిమాతో.. డిజాస్టర్ ఫేస్ చేశాడు వరుణ్. ఇక ఈసారి ఎలాగైనా సూపర్ సక్సెస్ అందుకోవాలని ఆరాటంలో ఉన్నాడు మెగా ప్రిన్స్(Mega Prince). అయితే మెగా హీరోల్లో వరుణ్ తేజ్ కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తుంటాడు. సక్సెస్ ఫెయిల్యూర్ కు సబంధం లేకుండా.. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా .. కంటెంట్ ఉన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ వస్తున్నాడు. లాస్ట్ ఇయర్ వరుణ్ తేజ్ కు ఏమాత్రం కలిసి రాలేదు.

ఎంతో కష్టపడి .. సిక్స్ ప్యాక్(Six packs) చేశాడు. విదేశాల్లో బాక్సింగ్.. నేర్చుకున్నాడు. టోంన్డ్ బాడీతో హ్యాండ్సమ్ గా మేకోవర్ అయ్యాడు. ఇంత కష్షపడి మేకోవర్ అయిన వరుణ్ తేజ్.. గని సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. అది మరువకముందే.. ఎఫ్-3 సినిమాతో.. మరో ఫెయిల్యూర్ ఎదురైంది. దాంతో ప్రస్తుతం వరుణ్‌తేజ్ ఆశలన్ని గాంఢీవధారి అర్జున(Gandeevadhari Arjuna) సినిమా పైనే ఉన్నాయి. ప్రవీణ్ స‌త్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది.

అయితే గాంఢీవధారి సినిమా నుంచి ఇప్పటివరకూ రిలీజ్ అయిన అప్ డేట్స్.. పోస్టర్స్.. మేకింగ్ వీడియోస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాపై ఇవి భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. అయితే తాజాగా ఈసినిమాపై భారీ అప్ డేన్ ను అందించారు టీమ్. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను(Release date) తాజాగా ప్రకటించారు. ఈ సినిమాను ఆగస్టు 25న విడుదల చేస్తున్నట్లు మూవీ టీమ్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఈవిషయాన్ని ప్రకటిస్తూ.. ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది మూవీ టీమ్.

వరుణ్‌ తేజ్‌ గన్‌ పట్టుకుని అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. సహా నిర్మాతగా నాగబాబు వ్యవహరిస్తున్నాడు. మిక్కీ జే మెయర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటించింది.

Updated On 28 Jun 2023 2:24 AM GMT
Ehatv

Ehatv

Next Story