అల్లు అర్జున్ (Allu Arjun)-సుకుమార్(Sukumar) కాంబినేషన్‌లో మరికొన్ని వారాలలో రాబోతున్న పుష్ప 2(Pushpa-2) సినిమా ట్రయిలర్ విడుదలయ్యింది.
అల్లు అర్జున్ (Allu Arjun)-సుకుమార్(Sukumar) కాంబినేషన్‌లో మరికొన్ని వారాలలో రాబోతున్న పుష్ప 2(Pushpa-2) సినిమా ట్రయిలర్ విడుదలయ్యింది. ట్రయిలర్‌కు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. హీరోలు, నిర్మాతలు, దర్శకులు తెగ మెచ్చుసుకుంటున్నారు. ఇప్పటి వరకు మెగా కాంపౌండ్(Mega family) నుంచి మాత్రం ఒక్క మాట కూడా రాలేదు. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇలాంటి వాటికి అతీతుడు కాబట్టి ఆయనను వదిలేద్దాం. మరి మిగతా హీరోలకు ఏమైంది. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ట్రైలర్‌ను విడుదల చేశారు. దానిపై సోషల్ మీడియాలో రెండు ముక్కలు రాసి ఉంటే ఓ పనైపోయేది కదా! వారు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు. అల్లు అర్జున్‌ను ఒంటరివాణ్ణి చేశారా? ఏమో మరి! చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. చిరంజీవి అండదండలతోనే అల్లు అర్జున్ సినిమాల్లోకి వచ్చాడన్నది నిజం! చిరంజీవి ఫ్యాన్స్ మొదట్లో బన్నీని ఆదరించిన మాట కూడా వాస్తవమే! అయితే అనతి కాలంలోనే బన్నీ తనకు తానుగా ఎదిగాడు. ఇప్పుడతడికి ప్రత్యేకంగా అభిమానులున్నారు. నేషనల్ స్టార్ అయ్యాడు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా గెల్చుకున్నాడు. కాబట్టి మెగా కాంపౌండ్ నుంచి రియాక్షన్ రాకపోయినా ఐకాన్ స్టార్‌కు వచ్చే నష్టమేమీ లేదు. కాకపోతే మెగా కాంపౌండ్ నుంచి ఎవరో ఒకరు కామెంట్ చేసి ఉంటే బాగుండేదని బన్నీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.