తాజాగా వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ బాబీ(Bobby). ఈమూవీ సూపర్ హిట్ అవవ్వడంతో.. బాబీ నెక్ట్స్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మరి బాబీ సినిమా ఎవరితో..?
మెగా డైరెక్టర్(Mega director) గా ముద్ర పడిపోయి దర్శకుడు బాబీ.. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో(mega star chiranjeevi) మాస్ మసాలా ఎంటర్టైనర్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు బాబీ. ఈసినిమా చాలా కాలం తరువాత మెగా ఫ్యానస్ కు మాస్ ఎంటర్టైన్మెంట్ ను అందించింది. ఊరమాస్ లుక్ లో మెగాస్టార్ కన్నుల పండుగ చేశాడు ఈసినిమాలు.

తాజాగా వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ బాబీ(Bobby). ఈమూవీ సూపర్ హిట్ అవవ్వడంతో.. బాబీ నెక్ట్స్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మరి బాబీ సినిమా ఎవరితో..?

మెగా డైరెక్టర్(Mega director) గా ముద్ర పడిపోయి దర్శకుడు బాబీ.. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో(mega star chiranjeevi) మాస్ మసాలా ఎంటర్టైనర్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు బాబీ. ఈసినిమా చాలా కాలం తరువాత మెగా ఫ్యానస్ కు మాస్ ఎంటర్టైన్మెంట్ ను అందించింది. ఊరమాస్ లుక్ లో మెగాస్టార్ కన్నుల పండుగ చేశాడు ఈసినిమాలు. మెగా స్టార్ కు తోడు.. ఆయన తమ్ముడిగా మాస్ మహారాజ్ రవితేజ్(Ravi teja) పెర్ఫామెన్స్ పీక్స్ అనిచెప్పాలి.

ఇక ఈసినిమా చేసిన తరువాత డైరెక్టర్ బాబీకి వరుసగా ఆఫర్లు వస్తాయి అనుకున్నారు అంతా. ఆయన మళ్లీ బిజీ అయిపోతాడు అనుకున్నారు. కాని బాబీ మళ్ళీ ఇంత వరకూ నెక్ట్స్ మూవీ ఏం చేస్తున్నాడు అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఫలానా హీరోకి కథ చెప్పినట్టు కూడా రూమర్స్ కూడా వినిపించలేదు. అయితే ఆయన మాత్రం ఓ స్టార్ హీరో కోసం కథ రాసుకున్నారట. కాని ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.

బాబీ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీని రాసి పెట్టుకున్నాడట. అయితేమహేష్ కాస్త టైమ్ ఇస్తే చెప్పాలని ఎదురుచూస్తున్నాడట. కాని మహేష్ మాత్రం ఇప్పుట్లో అందేట్టు లేదు. మహేష్ తో మూవీ బాబీ చిరకాల కలగా తెలుస్తోంది. అంతే కాదు ఇప్పటికే మహేష్ కోసం తన దగ్గర ఓ పవర్‌ఫుల్ స్టోరీలైన్ ఉందని బాబీ చెబుతున్నాడు. మహేష్ గనక తనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ సినిమా కథను తాను రెడీ చేస్తానని చెప్పుకొచ్చాడు ఈ యంగ్ డైరెక్టర్.

అటు మహేష్ బాబు మాత్రం ప్రస్తుతం త్రివిక్రమ్(trivikram) తో చేస్తోన్న SSMB28 నే త్వరగా కంప్లీట్ చేయడంలేదు. ఆతరువాత రాజమౌళి సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాకు ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారో తెలియదు. ఈలెక్కన మహేష్ బాబు బాబీకి అందే అవకాశం ఉందా..? రాజమౌళి సినిమా రిలీజ్ అయ్యి.. మహేష్ స్థాయి ఇంకా పెరిగితే.. బాబీ సూపర్ స్టార్ తో సినిమా చేయగలడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాదు. మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసిన అనిల్ రావిపూడి కూడా మరోసారి సూపర్ స్టార్ తో సినిమా చేసే ప్రయత్నం చేస్తున్నాడట.

Updated On 3 May 2023 12:54 AM GMT
rj sanju

rj sanju

Next Story