ఆ ఈవెంట్లో నాగ‌బాబు మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ తన కెరీర్ బిగినింగ్ నుంచి ఛాలెంజింగ్, రిస్కుతో

వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వరుణ్ తేజ్ కు పోలీస్, ఆర్మీ పాత్రలు సరిగ్గా సరిపోతాయని, 5.3 అడుగుల ఎత్తున్న వ్యక్తికి ఆ పాత్రలు సరిపోవని అన్నారు. ఒక హీరోని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో నాగబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ... పోలీస్ క్యారెక్టర్‌ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది... 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడానని చెప్పారు. ఆ మాటలను తాను వెనక్కి తీసుకుంటున్నానని, ఎవరైనా ఆ మాటలకు నొచ్చుకునుంటే, అయాం వెరీ సారీ అని అన్నారు. ఆ మాటలు యాదృచ్ఛికంగా వచ్చినవే కానీ, కావాలని అన్న మాటలు కాదని అన్నారు.

ఆ ఈవెంట్లో నాగ‌బాబు మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ తన కెరీర్ బిగినింగ్ నుంచి ఛాలెంజింగ్, రిస్కుతో కూడుకున్న పాత్రలు చేస్తున్నాడని అన్నారు. ఇది ఒక తండ్రిగా త‌న‌కు ఎంతో గర్వాన్ని కలిగిస్తోందని, ముఖ్యంగా ఆర్మీ, పోలీస్ తరహా పాత్రలకు వరుణ్ హైట్, బాడీ లాంగ్వేజ్ సరిగ్గా సరిపోతాయని అన్నారు. 5.3 అడుగులు ఉండే హీరో ఇలాంటి పాత్ర‌లు వేస్తే అత‌డికి ఆ పాత్ర‌ బాగుండదని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు సోష‌ల్ మీడియాలో దూమారం రేపాయి. ఈ వివాదం ముదరడంతో నాగబాబు క్షమాపణలు తెలిపారు.

Updated On 29 Feb 2024 3:14 AM GMT
Yagnik

Yagnik

Next Story