మీరా చోప్రా (Meera Chopra) ఒకప్పుడు ఈ పేరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేమస్. వాన (Vaana) సినిమాతో చాలా మంది మనసులు దోచుకుంది ఈ అమ్మాయి. మీరా చోప్రా 2006లో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన బంగారం (Bangaram) సినిమాతో టాలీవుడ్‏లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వచ్చిన వాన సినిమాతో కాస్త గుర్తింపు దక్కించుకుంది మీరా చోప్రా.

మీరా చోప్రా (Meera Chopra) ఒకప్పుడు ఈ పేరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేమస్. వాన (Vaana) సినిమాతో చాలా మంది మనసులు దోచుకుంది ఈ అమ్మాయి. మీరా చోప్రా 2006లో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన బంగారం (Bangaram) సినిమాతో టాలీవుడ్‏లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వచ్చిన వాన సినిమాతో కాస్త గుర్తింపు దక్కించుకుంది మీరా చోప్రా.

2011లో మారో (Maaro)చిత్రం, 2013లో గ్రీకు వీరుడు (Greeku Veerudu), 2015లో మొగలిపువ్వు వంటి చిత్రాల్లో నటించింది మీరా చోప్రా. తెలుగులో నాలుగైదు సినిమాలు చేసినా కూడా ఆమెను తెలుగు ఆడియన్స్ అంతా ఆదరించలేదు. తెలుగు సినిమాలో సక్సెస్ రేట్ లేకపోవడంతో.. మెల్లగా టాలీవుడ్‏కి టాటా.. బైబై చెప్పేసి తమిళ్, హిందీ సినిమాల వైపు అడుగులు వేసింది ఈ బ్యూటీ.

ఇదిలా ప్రస్తుతం బాలీవుడ్‏కి గడ్డు కాలమే నడుస్తుందని చెప్పాలి. ఎందుకు కంటే వరుస అపజయాలు, సౌత్ సినిమాల హవాతో నిరాశలో ఉన్న బాలీవుడ్‏ని నెపొటిజం, కాస్టింగ్‏కౌచ్ వంటి అంశాలు కుదిపేస్తున్నాయి. ఒక్కోసారి ఒక్కో సిచువేషన్‏తో ఇండస్ట్రీ విమర్శలను ఎదుర్కొంటుంది. తాజాగా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.

ఇంతకీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఎమన్నది అనుకుంటున్నారా.. ‘‘బాలీవుడ్‏లో ఉండలేకే హాలీవుడ్‏కి వెళ్లానంటూ’’ మాట్లాడింది. కొందరు గ్రూపులుగా ఏర్పడి తనను ఒంటిరి చేశారని.. ఆ రీజన్ తోనే హాలీవుడ్‏కి వెళ్లానని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలకు ఆమె సిస్టర్ మీరా చోప్రా (Meera Chopra) రియాక్ట్ అయింది. ‘‘ వారసత్వం లేకుండా బయటి నుంచి వచ్చిన వాళ్లకి స్టార్స్‏గా ఎంత పేరు తెచ్చుకున్నా.. వివక్ష తప్పదు. చివరకు వాళ్లను ఒంటరివాళ్లనే చేస్తారు. ఇక్క రూల్ బుక్ పాటించని ఆ స్టార్స్‏ను తొక్కేయాలని కొన్ని గ్రూపులు ప్రయత్నిస్తూ ఉంటాయి. హాలీవుడ్‏లో తన సక్సెస్‏లతో మా సిస్టర్ ప్రియాంక అలాంటి వారికి గుణపాఠం నేర్పింది’’ అంటూ మాట్లాడింది.

అయితే బేవాచ్ (Baywatch) సినిమాతో హాలీవుడ్‏లోకి ప్రియాంక చోప్రా అరంగేట్రం చేసింది. అక్కడ ది వైట్ టైగర్ (The White Tiger), రిమాంటిక్ (Romantic), ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ (The Matrix Resurrections) వంటి సినిమాలతో హీరోయిన్‏గా పేరు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ప్రియాంక చోప్రా వెబ్ సిరీస్‏లకు సైన్ చేసి.. ఆ షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటుంది.

Updated On 6 April 2023 6:18 AM GMT
Ehatv

Ehatv

Next Story