కొన్ని సర్ ప్రైజింగ్ కాంబినేషన్లు ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తుంటాయి. ఎవరూ ఊహాంచని కాంబోలు ఇప్పటికే సందడి చేయడానికి రెడీ అవుతుండగా.. తాజాగా మరో కాంబినేషన్ ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేయడానికి రెడీ అవుతుంది. ఇంతకీ ఏంటా కాంబో..

కొన్ని సర్ ప్రైజింగ్ కాంబినేషన్లు ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తుంటాయి. ఎవరూ ఊహాంచని కాంబోలు ఇప్పటికే సందడి చేయడానికి రెడీ అవుతుండగా.. తాజాగా మరో కాంబినేషన్ ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేయడానికి రెడీ అవుతుంది. ఇంతకీ ఏంటా కాంబో..

బాలయ్య బాబు(Bala Krishna) మంచి ఊపు మీద ఉన్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్ లో నటిస్తున్న బాలయ్య.. నెక్ట్స్ దర్శకుడు బాబీ(Bobby) కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుందని టాక్ నడుస్తోంది. ఐతే, ఈ సినిమాలో నటించే హీరోయిన్ పై తాజాగా ఓ రూమర్ వినిపిస్తోంది. హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary)ని బాలయ్యకి జోడీగా సెలెక్ట్ చేశారని.. ఆమె పాత్రకు కథలో ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తోంది.

ఏది ఏమైనా బాలయ్య బాబు – మీనాక్షి చౌదరి కాంబినేషన్ అంటే అదిరిపోతుంది. ఇక ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ వండర్ ఫుల్ గా ఉంటాయట. ముఖ్యంగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట.ఈ సినిమాలో బాబీ బాలయ్య ఫ్యాన్స్ కోసం ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి. అన్నట్టు ఈ సినిమా బాలయ్య మార్క్ చూపించే విధంగా యాక్షన్ డ్రామా కాదు అని.. ఇదొక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ డ్రామా అని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

కాగా ఈ సినిమాలో పాలిటిక్స్ నేపథ్యంలో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. అన్నట్టు ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్‌‌ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి బాలయ్యకు బాబీ సూపర్ హిట్ ఇవ్వగలడా.. లేదా చూడాలి.

Updated On 10 Oct 2023 5:59 AM GMT
Ehatv

Ehatv

Next Story