తెలుగు తమిళంతో సహా పలు భాషల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని క్రియేట్ చేసుకున్న అలనాటి నటి మీనా(Actress meena).. చిరంజీవి,(chiranjeevi)బాలకృష్ణ(balakrishna) ,నాగార్జున(nagaarjuna)వంటి అగ్ర హీరోలు సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన మీనా తెలుగులో అనేక సినిమాల్లో నటించింది తెలుగుతో సహా పలు భాషల్లో నటించింది మీనా..నటిగా తన 40 సంవత్సరాల జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలో మీనాకు(Actress meena). సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.. ఈ సన్మాన సభకు అతిధులుగా తమిళ చిత్ర పరిశ్రమకు(kollywood) సంబంధించిన పలువురు ప్రముఖులు విచ్చేసారు .. ఈ సభకు ముఖ్య అతిథిగా రజనీకాంత్ (Rajini kanth)పాల్గొన్నారు .

ఈ సన్మాన సభలో మీనా కూతురు నైనికా(nainika) మీనా గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది . మీనా భర్త ఇటీవల మరణించారు తండ్రి మరణం తర్వాత తన తల్లి ఎంతో మానసిక కుంగుబాటుకు గురైందని అదొక బాధాకరమైన సమయం అంటూ మీనా కూతురు నైనికా సభలో మాట్లాడింది.. నైనిక (nainika)మాట్లాడిన మాటలకు సభలో రజనీకాంత్ కంటతడి పెట్టుకున్నారు..
నువ్వు ఎంతగానో శ్రమించి ఈ స్థాయికి వచ్చినందుకు నేను గర్విస్తున్నాను అమ్మ, నటిగా నువ్వు ఎంత కష్టపడుతున్నా ఇంటికి వచ్చేసరికి నన్ను ఒక అమ్మలా ప్రతిక్షణం ఎంతో జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటావు.. చిన్నప్పుడు మాల్ కి వెళ్ళినప్పుడు వేరే షాప్ లోకి వెళ్ళిపోయి చాక్లెట్స్ తింటూ కూర్చున్నాను నేను కనిపించకపోయేసరికి నువ్వు కంగారు పడ్డావు... కోపంతో నా మీద అరిచావు .. ఇప్పుడు ఆ కోపం వెనకాల ఉన్న ప్రేమ అర్థమవుతుంది.. అప్పుడు నిన్ను కంగారు పెట్టినందుకు సారీ! అమ్మ ...
నాన్న చనిపోయాక పరిస్థితిలన్నీ చాలా చీకటిగా మారిపోయాయి మానసికంగా అమ్మ ఎంతో కృంగిపోయింది ఇకపై నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అన్ని విషయాల్లో నీతో సహాయంగా ఉంటాను! అని మీనా కూతురు నైనికా మాట్లాడుతూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కళ్ళు చెమర్చాయి .. రజనీకాంత్ తో పాటు పలు సెలెబ్రిటీలు హృదయాలను కదిలించాయి నైనికా మాటలు..
అలాగే తాజాగా మీనా(Actress Meena). రెండో పెళ్లి చేసుకోబోతుదంటూ వచ్చిన పుకార్లపై నైనిక స్పందిస్తూ.. అమ్మ గురించి చాలా కొద్ది రోజులుగా కొన్ని ఫేక్ వార్తలు వస్తున్నాయి అమ్మ కేవలం నటి మాత్రమే కాదు... ఆమె మీ అందరిలాగా మనిషే ,తనక్కూడా ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి ఇకనైనా ఇలాంటివి రాయొద్దు అంటూ నైనిక మాట్లాడిన మాటలు అక్కడ ఉన్నవారిని కంట తడిపెట్టేలా చేసాయి .. ఈ వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతుంది..