పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దర్శకుడు క్రిష్(Krish) జాగర్లమూడి రూపొందిస్తున్న హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) సినిమాలో నటిస్తున్నారు. హైదరాబాద్ దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో షూటింగ్ జరుగుతోంది.

Pawan Kalyan Shooting
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దర్శకుడు క్రిష్(Krish) జాగర్లమూడి రూపొందిస్తున్న హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) సినిమాలో నటిస్తున్నారు. హైదరాబాద్ దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో షూటింగ్ జరుగుతోంది. అయితే ఆదివారం అర్ధరాత్రి షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్‌లో ఒక్కసారిగా మంటలు(Fire) వ్యాపించాయి. మంటలను గమనించిన చిత్ర యూనిట్ వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది కూడా నిమిషం ఆలస్యం చేయకుండా హుటాహుటిన సంఘటన స్థానికి చేరుకున్నారు.
కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పేశారు. ఆ మధ్యన కురిసిన వర్షానికి సెట్ కూలింది. దానికి మరమ్మతులు చేసే క్రమంలోనే మంటలు అంటుకున్నాయని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోయినప్పటికీ భారీ ఆస్తి నష్టం మాత్రం జరిగింది. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కల్యాణ్‌కు జోడిగా నిది అగర్వాల్(Needhi Agaarwal) నటిస్తున్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రను బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పోషిస్తున్నారు. ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్‌రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఎం.ఎం.కీరవాణి అందిస్తున్నారు.
