రావణాసురగా ప్రేక్షకులను అలరించిన మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) ఇప్పుడు ఈగల్(Eagle)తో థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ఘట్టమనేని కార్తీక్(Karthik Gattamneni) దర్శకత్వం వహిస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad) నిర్మిస్తున్నారు. రవితేజకు జోడిగా అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) నటిస్తున్నారు. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, కావ్య థాపర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Ravi Teja Eagle

ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను సోమవారం విడుదల చేశారు. అందులో రవితేజ పాత్రలోని భిన్న కోణాల్ని వివిధ వ్యక్తుల మాటల ద్వారా పరిచయం చేశారు. ‘రా’ ఏజెన్సీ దృష్టిలో అతనొక మోస్ట్ వాంటెడ్ పెయింటర్. కానీ, మరో వ్యక్తి అతను పత్తి పండించే రైతని చెబుతాడు. మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు అతనిదని షాకిస్తాడు నవదీప్. ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి? అంటూ మధ్యలో అనుపమ పరమేశ్వరన్ వేసే ప్రశ్నతో రవితేజలోని యాక్షన్ కోణాన్ని ఆవిష్కరించారు. ఆ చూపె మరణం.. ఆ అడుగె సమరం అంటూ చివరలో ప్రచార చిత్రాన్ని ముగించారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఇదో భిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని పలు లోకెషన్లలో జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు. ఈగల్ సినిమాకు దవ్‌జాంద్ సంగీతం అందిస్తున్నారు.