మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటించిన చిత్రం రావణాసుర (Ravanasura). సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో వహించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్, ఆర్‏టీ టీమ్ వర్క్స్ బ్యానర్‏పై అభిషేక్ నామా నిర్మించారు. ఇక ఈ మూవీలో అను ఇమ్మాన్యూయేల్, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ హీరోయిన్లు నటించారు. అయితే హీరో సుశాంత్ ఈ చిత్రంలో ఓ కీలక రోల్ చేశారు. ఇప్పుటికే రిలీజైన ట్రైలర్, పాటలు మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాలతో ఇవాళ (April 7th)ప్రేక్షకుమల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇప్పటికే ఓవర్సీస్‏తోపాటు పలుచోట్ల ఫస్ట్ డే షోలు పడిపోయాయి.

ఇక సినిమా చూసిన వాళ్లు ఆగకుండా ఉంటారా.. అదే ఎగ్జయిట్‏మెంట్‏తో సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అసలు రావణాసుర కథేంటి ? అది ఎలా ఉంది ? రవితేజ (Ravi Teja) ఖాతాలో మరో హిట్ పడినట్లేనా ఇలాంటి విషయాలను సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. మీరు చదువుతున్న కంటెంట్‏కి ఈహా (Eha) వెబ్‏సైట్‏కి ఎలాంటి సంబంధం ఉండదు.. సోషల్ మీడియా అభిప్రాయాన్నే తెలియజేస్తున్నాము.

రావణాసుర ఫుల్ మసాల థ్రిల్లర్ మూవీ. మాస్ రాజా అభిమానులతోపాటు కామన్ ఆడియన్స్‏ని కూడా అలరిస్తుంది. రవితేజ (Ravi Teja) ను ఎప్పుడూ చూడనట్టు ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఉంటుందని.. స్టోరీ, ఇంటర్వెన్ బ్యాంగ్ సీన్, బీజీఎం (BGM) అంతా బాగుందంటూ ఓ నెటిజన్ కమెంట్ చేస్తూ.. హైయెస్ట్ రేటింగ్ ఇచ్చారు. ఇక సెకండ్ ఆఫ్‏లో మంచి ట్విస్టులు ఉంటాయని.. క్లైమాక్స్, బ్యాక్‏గ్రౌండ్ మ్యూజిక్ బావుందని.. ఒక అడ్వొకేట్ క్రిమినల్‏గా మారితే ఎలా ఉంటుందో రవితేజ చూపించాడని.. మాస్ రాజా పాకెట్ లో మరో హిట్ పడిందంటు ఓ నెటిజన్ కమెంట్ చేశారు

మరో నెటిజన్ అయితే ఫస్ట్ హాఫ్ డీసెంట్.. ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్ బ్లోయింగ్. సెకండాఫ్ సూపర్. హిరోయిన్స్ క్యారెక్టర్స్ అంతా బాలేవని.. రవన్న యాక్టింగ్ అదిరిపోయిందని కామెంట్ చేశారు. సినిమాకు త్రి అండ్ హాఫ్ రేటింగ్ ఇచ్చాడు. మరో నెటిజన్ కాస్త నెగెటివ్ గానే కామెంట్ చేశారు. రవితేజ అన్న ప్లీజ్ ఇలాంటి మూవీస్ చేయకు.. నిప్పు (Nippu), ఖిలాడి (Khiladi) లాంటి సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతోందని తన ఒపినియన్‏ను చెప్పేశాడు. మరొకరు కూడా అదే విధంగా రియాక్ట్ అయ్యాడు. నువ్వు డిజాస్టర్ సినిమాలు తీస్తున్నావంటు ట్వీట్ చేశాడు.

ఓవరాల్‏గా రావణాసుర చిత్రం కాస్త చప్పగానే ఉందంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్‏గా వచ్చిన సినిమాలు రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసిన సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏమాత్రం వసూళ్లను రాబడుతుందో చూడాలి మరి.

Updated On 7 April 2023 2:57 AM GMT
Ehatv

Ehatv

Next Story