టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ గెలుపు ఓటమీ అనే తేడా లేకుండా.. వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి... కొంచెం లేట్ అయినా సరే.. నేడు మాస్ హీరోగా ఎంతో ఇమేజ్ ని, అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇక మాస్ లేగసీని ఇండస్ట్రీలో కొనసాగించేందుకు రవితేజ కొడుకు రెడీ అవుతున్నాడు. రవితేజ కంటే షార్ప్ గా డైలాగ్స్ చెపుతూ.. తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు.

స్టార్ హీరోల పిల్లలు ఎప్పుడు కనిపిస్తారా అని ఎదురు చూస్తుంటారు అభిమానులు. ఇప్పుడు ప్రజెంట్ జరరేషన్ లో వారి సోషల్ మీడియా అకౌంట్స్ ఫాలో అవుతూ.. వారిని చూసుకుంటున్నారు. తాజాగా మాస్ మహారాజ్ రవితేజ్ పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ గెలుపు ఓటమీ అనే తేడా లేకుండా.. వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి... కొంచెం లేట్ అయినా సరే.. నేడు మాస్ హీరోగా ఎంతో ఇమేజ్ ని, అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇక మాస్ లేగసీని ఇండస్ట్రీలో కొనసాగించేందుకు రవితేజ కొడుకు రెడీ అవుతున్నాడు. రవితేజ కంటే షార్ప్ గా డైలాగ్స్ చెపుతూ.. తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు.

రవితేజ కొడుకు పేరు మహాధన్ (Mahadhan).ఇప్పటికే రాజా ది గ్రేట్ (Raja The Great) సినిమాలో రవితేజ వచిన్నతనంలో పాత్ర క్యారెక్టర్ చేసి వెండితెరకు.. ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు.ఆ సినిమా తరువాత మళ్ళీ మహాధన్ మళ్ళీ బయట పెద్దగా కనిపించలేదు. తను ఇప్పుడు ఎలా ఉన్నాడబ్బా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు వారి ఫోటోలతో ట్రీట్ ఇచ్చాడు రవితేజ పర్సనల్ అసిస్టెంట్.

రవితేజ దగ్గర పర్సనల్ అసిస్టెంట్ గా చేసే శ్రీనివాస్ రాజ్ దాదాపు అందరికి తెలిసిన వ్యాక్తే. రవితేజతో కలిసి కొన్ని సినిమాల్లో కూడా కనిపించాడు. తాజాగా శ్రీనివాస్ తన సోషల్ మీడియాలో రవితేజ కొడుకు, కూతురితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫొటోల్లో మహాధన్ కళ్లజోడుతో కూల్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే ఆరడుగులు ఎత్తు కూడా ఎదిగినట్లు తెలుస్తుంది. ఇక రవితేజ కూతురు మోక్షద.. అయితే రవితేజ సినిమా ఫంక్షన్స్ లో కూడా కనిపించదు. కాని ఈసారి సోషల్ మీడియలో కనిపించి హడావిడి చేస్తోంది. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated On 7 Jun 2023 11:55 PM GMT
Ehatv

Ehatv

Next Story