మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) తన ఇంపాక్ట్ పెర్ఫామెన్స్‏తో ఆడియన్స్‏ను ఆకట్టుకుంటాడు. విశ్వక్ సేన్ రీసెంట్‏గా దాస్ దా దమ్కీ (Das Ka Dhamki) అనే యాక్షన్ అండ్ కామెడీ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్‏టైన్ చేశాడు. తాజాగా విశ్వక్ సేన్ కొత్త సినిమా పోస్టర్‏ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.

VS11 అనే టైటిల్‏తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని షూటింగ్‏ను ప్రారంభించింది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సినిమా పోస్టర్‏లో విశ్వక్ సేన్ గంగానమ్మ దేవత దగ్గర అగ్గి కాగడను చేతితో పట్టుకుని ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ పోస్టర్‏కు ‘‘గంగానమ్మ జాతర మొదలైంది.. ఈ సారి శివాలెత్తి పోద్ది’’ అంటూ విశ్వక్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ సినిమాను సితార ఎంటర్‏టైన్‏మెంట్స్, ఫార్య్చూన్ ఫోర్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి.

శ్రీకర స్టూడియోస్ సమర్ఫణలో వస్తున్న ఈ చిత్రంలో అంజలి (Anjali) హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) అందిస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో ఇప్పటి వరకు చూడని విశ్వక్ సేన్‏ని చూపిస్తారట. మాస్ కా దాస్ నుంచి ఓ డిఫరెంట్ మూవీ వస్తుండటంతో ఇటు ప్రేక్షకులతో పాటు విశ్వక్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Updated On 15 May 2023 12:35 AM GMT
Ehatv

Ehatv

Next Story