మర్యాద రామన్న(Maryada Ramanna) సినిమాలో సునీల్‌(Sunil) పక్కన హీరోయిన్‌గా నటించిన సలోని ఆ ఒక్క చిత్రంతోనే తెలుగులో మంచి గుర్తింపు పొందారు. అందం ప్లస్‌ అభినయంతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత బాడీగార్డ్‌ చిత్రంలో నటించారు. కొన్ని సినిమాలలో స్పెషల్‌ సాంగ్స్‌లో తళుక్కుమని మెరిశారు.

మర్యాద రామన్న(Maryada Ramanna) సినిమాలో సునీల్‌(Sunil) పక్కన హీరోయిన్‌గా నటించిన సలోని(Saloni) ఆ ఒక్క చిత్రంతోనే తెలుగులో మంచి గుర్తింపు పొందారు. అందం ప్లస్‌ అభినయంతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత బాడీగార్డ్‌ చిత్రంలో నటించారు. కొన్ని సినిమాలలో స్పెషల్‌ సాంగ్స్‌లో తళుక్కుమని మెరిశారు. అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన రేసు గుర్రం సినిమాలో అతిథి పాత్ర పోషించిన ఈ అందాల భామ తెలుగు సినిమాలకు కాసింత విరామం ఇచ్చారు. చాలా కాలం తర్వాత తంత్ర(Tantra Movie) అనే సినిమాతో మళ్లీ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. మల్లేశం, వకీల్‌సాబ్‌ సినిమాల ఫేమ్‌ అనన్య నాగళ్ల(Ananya Nagalla) ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సలోని ఓ ముఖ్య భూమికను పోషిస్తున్నారు. ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వైజాగ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాతో శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. దీనికి మంచి స్పందన లభించింది. భయంకరమైన క్షుద్రశక్తులు అనన్యని పీడిస్తున్నట్టుగా కనపడుతున్న పోస్టర్‌ సినిమాపై ఇంట్రెస్ట్‌ను పెంచుతోంది. దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ లైన్‌తో రూపొందుతున్న హారర్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా ఇదని నిర్మాతలు చెబుతున్నారు. తంత్ర శాస్త్రానికి చెందిన రహస్యాలను ఈ చిత్రం ద్వారా చెప్పబోతున్నామన్నారు. సలోని ఇందులో డిఫరెంట్‌గా కనిపిస్తారని, నటనకు ఆస్కారమున్న పాత్ర అని చెప్పారు.

Updated On 25 Aug 2023 4:15 AM GMT
Ehatv

Ehatv

Next Story