తమిళనటుడు మన్సూర్ అలీఖాన్(Mnsoore Ali Khan) మళ్లీ కారుకూతలు కూశాడు. ఇప్పటికే త్రిషపై(Trisha Krishnan) అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న మన్సూర్ ఇప్పుడు ఆ వివాదం మరింత ముదిరేలా చేసుకున్నాడు. తాజాగా మరికొన్ని పిచ్చి కామెంట్లు చేశాఉఉ. 'నేను చేసిన కామెంట్లను త్రిష ఖండించింది. ఆమె వ్యాఖ్యలను ప్రచురించిన మీడియా మా ఇద్దరి ఫోటోలను పక్కపక్కనే ప్రింట్ చేసింది.

Mansoor Ali Khan
తమిళనటుడు మన్సూర్ అలీఖాన్(Mnsoor Ali Khan) మళ్లీ కారుకూతలు కూశాడు. ఇప్పటికే త్రిషపై(Trisha Krishnan) అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న మన్సూర్ ఇప్పుడు ఆ వివాదం మరింత ముదిరేలా చేసుకున్నాడు. తాజాగా మరికొన్ని పిచ్చి కామెంట్లు చేశాఉఉ. 'నేను చేసిన కామెంట్లను త్రిష ఖండించింది. ఆమె వ్యాఖ్యలను ప్రచురించిన మీడియా మా ఇద్దరి ఫోటోలను పక్కపక్కనే ప్రింట్ చేసింది. ఆ ఫోటోలో చూస్తుంటే త్రిష పెళ్లి కూతురులా(Bride), నేను పెళ్లి కొడుకులా(Groom) ఉన్నట్టు అనిపించింది. అయితే నా ఫోటో మాత్రం మంచిది వాడలేదు. అంతకంటే నా మంచి ఫోటోలు వారికి దొరకలేదా?' అని మన్సూర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు త్రిషకు క్షమాపణలు చెప్పేంతవరకు మన్సూర్‌ను సంఘం నుంచి నిషేధిస్తున్నట్టు నడిగర్ సంఘం(Nadigar community) ప్రకటించింది. దీనిపై కూడా మన్సూర్ సీరియస్ అయ్యాడు. 'నా వివరణ కోరకుండానే ఏకపక్షంగా నడిగర్ సంఘం ఆదేశాలు జారీ చేసింది. మరో నాలుగు గంటల్లోగా నడిగర్ సంఘం తన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలి' అంటూ ప్రెస్‌మీట్ పెట్టి మరి డిమాండ్ చేశాడు మన్సూర్. త్రిష గురించి తాను తప్పుగా మాట్లాడలేదని, మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిదని, త్రిషకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని చెప్పాడు. తనకు తమిళ ప్రజల మద్దతు ఉందని తెలిపారు.
తను కేవలం సినిమాలో రేప్ సీన్ గురించి మాత్రమే మాట్లాడానని, నిజంగా రేప్ చేసినట్టు మీడియా ప్రచారం చేసిందన్నాడు. సినిమాలలో మర్డర్ సీన్‌లో నటిస్తే, నిజంగా మర్డర్ చేసినట్టా అని ప్రశ్నించాడు మన్సూర్ అలీఖాన్.
