నటి త్రిష(Actress Trisha)పై అవాకులు చవాకులు పేలిన తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Mansoor Ali Khan) అనుకున్నంత పనీ చేశాడు. మెగాస్టార్‌ చిరంజీవి(Mega Star Chiranjeevi), నటి త్రిష కృష్ణన్‌(Trisha Krishnan)
, రాజకీయ నాయకురాలు, నటి కుష్బూ సుందర్‌పై మద్రాస్‌ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ పిటిషన్‌లో కోరారు.

నటి త్రిష(Actress Trisha)పై అవాకులు చవాకులు పేలిన తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Mansoor Ali Khan) అనుకున్నంత పనీ చేశాడు. మెగాస్టార్‌ చిరంజీవి(Mega Star Chiranjeevi), నటి త్రిష కృష్ణన్‌(Trisha Krishnan)
, రాజకీయ నాయకురాలు, నటి కుష్బూ సుందర్‌పై మద్రాస్‌ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ పిటిషన్‌లో కోరారు. తాను అన్న మాటలతో కూడిన వీడియో మొత్తం చూడకుండా తన పరువుకు భంగం కలిగించారన్నది మన్సూర్‌ అలీఖాన్‌ ఆరోపించారు. ఈ కేసు డిసెంబర్‌ 11వ తేదీ సోమవారం మద్రాస్‌ హైకోర్టు(Madras High Court) న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌కుమార్‌ ధర్మాసనం ముందు విచారణకు రానుంది. నటి త్రిష కృష్ణన్‌పై మన్సూర్ అలీ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మన్సూర్‌ అలీఖాన్‌ అన్న మాటలను త్రిష కృష్ణన్‌తో పాటు చిరంజీవి, దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌, మాళవిక మోహనన్‌ మరికొందరు నటీనటులతో పాటు తమిళ నటుల సంఘాలు కూడా తీవ్రంగా ఖండించాయి. దీని తర్వాత జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు, నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ తమిళనాడు డీజీపీకి కంప్లయింట్‌ చేశారు. అలీఖాన్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు చెన్నై థౌజండ్ లైట్ పోలీసులు మన్సూర్ అలీఖాన్‌పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఫిర్యాదు దాఖలైన సమయంలో, మన్సూర్ అలీఖాన్ చెన్నై హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది. మరోవైపు, మన్సూర్ అలీఖాన్ ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో త్రిషకు మన్సూర్‌ క్షమాపణలు చెప్పాడు. ఆయన క్షమాపణలను కూడా త్రిష అంగీకరించింది.

Updated On 9 Dec 2023 1:05 AM GMT
Ehatv

Ehatv

Next Story