రామాయణం(Ramayanam) ఆధారంగా నిర్మించిన ఆదిపురుష్(adipurush) సినిమా విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు మొదలయ్యాయి. చాలా మంది సినిమాను తిట్టిపోస్తున్నారు. ముఖ్యంగా హనుమంతుడి(Hanuman) పాత్రకు సంబంధించిన కొన్ని డైలాగులు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ జనం అంటున్నారు.
రామాయణం(Ramayanam) ఆధారంగా నిర్మించిన ఆదిపురుష్(adipurush) సినిమా విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు మొదలయ్యాయి. చాలా మంది సినిమాను తిట్టిపోస్తున్నారు. ముఖ్యంగా హనుమంతుడి(Hanuman) పాత్రకు సంబంధించిన కొన్ని డైలాగులు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ జనం అంటున్నారు. చిత్ర మాటల రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా(Manoj Muntashir Shukla) చేసిన తప్పుకు లెంపలేసుకోవడం మానేసి అసలు తాము రామాయణం ఆధారంగా సినిమా తీయలేదని, ఇది కల్పిక కథ అని చెప్పడం మొదలుపెట్టారు.
సినిమాకు రిలీజ్‌కు ముందేమో ఇతగాడు రామాయణగాధను(ramayanam) ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా తాము సినిమాను రూపొందిస్తున్నామని అన్నాడు. మనోజ్ ముంతాషిర్ శుక్లాపై విమర్శల తాడికి పెరగడంతో ఆదిపురుష్‌లోని ఆ కొన్ని డైలాగులను మారుస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మేరకు అతడు ట్విట్టర్ వేదికగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టాడు. 'ప్రతి ఒక్కరి భావోద్వేగాలను గౌరవించడం రామకథ నుంచి నేర్చుకోవాల్సిన మొదటి పాఠం అని నా అభిప్రాయం.
ఆదిపురుష్ కోసం నేను నాలుగు వేల లైన్లకు పైగా సంభాషణలు రాశాను. వాటిలో అయిదు లైన్లు మాత్రమే కొందరిని బాధించాయని తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీరాముడిని(sri Rama), సీతమ్మను(Seetha) కీర్తిస్తూ చాలా సంభాషణలు ఉన్నాయి. కానీ వాటి కంటే ఈ కొన్ని మాటలే ఎక్కువ ప్రభావం చూపాయనిపిస్తోంది. మూడు గంటల సినిమాలో మూడు నిమిషాలు మీ ఊహకు భిన్నంగా రాశానని నాపై సనాతన ద్రోహి అని ముద్ర వేశారు.
ఈ చిత్రంలో ఉన్న జై శ్రీరాం, శివోహం, రామ్ సీతారామ్ వంటి గొప్ప పాటలు నా కలం లోంచి వచ్చినవే. మీరు ఇవేమీ చూడకుండా నాపై నింద వేయడంలో తొందరపడ్డారు అని అనుకుంటున్నా. నన్ను నిందించిన వారిపై నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. మేము సనాతన సేవ కోసం ఈ సినిమా తీశాం. అందరూ ఆదిపురుష్ సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు.
భవిష్యత్తులోనూ మీ ప్రేమాభిమానాలు ఇలాగే ఉంటాయని ఆశిస్తున్నాను. మాకు ప్రేక్షకుల మనోభావాలు ముఖ్యం. అందుకే చిత్ర బృందం అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాం. మీకు బాధ కలిగించిన డైలాగులను మారుస్తున్నాం. వారం రోజుల్లో ఈ మార్పును మీరు చూస్తారు. అందరి సూచనలను మేమ గౌరవిస్తున్నాం.' అని ట్విటర్ వేదికగా శుక్లా వివరించాడు. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు.