పోన్లే ఇప్పటికైనా మనోజ్‌ ముంతషిర్‌ శుక్లా(Manoju Muntashir Shukla) తన తప్పు తెలుసుకుని మన్నింపు వేడుకున్నాడు. నిన్నటి వరకు చేసిన పెద్ద తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేసిన మనోజ్‌ దేశం మొత్త తిట్టిపోస్తుండటంతో గత్యంతరం లేక క్షమాపణలు(Apologies)చెప్పాడు. ఇంతకీ ఇతగాడు చేసిన తప్పేమిటంటే ఆదిపురుష్‌(Adipurush) సినిమాకు డైలాగులు రాయడం..

పోన్లే ఇప్పటికైనా మనోజ్‌ ముంతషిర్‌ శుక్లా(Manoju Muntashir Shukla) తన తప్పు తెలుసుకుని మన్నింపు వేడుకున్నాడు. నిన్నటి వరకు చేసిన పెద్ద తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేసిన మనోజ్‌ దేశం మొత్త తిట్టిపోస్తుండటంతో గత్యంతరం లేక క్షమాపణలు(Apologies)చెప్పాడు. ఇంతకీ ఇతగాడు చేసిన తప్పేమిటంటే ఆదిపురుష్‌(Adipurush) సినిమాకు డైలాగులు రాయడం.. మాటలు రాస్తే తప్పేమీ లేదు కానీ రామాయణ గాధను ఆధారంగా చేసుకుని తీసిన ఆదిపురుష్‌కు నాసిరకం మాటలు(Bad words) రాయడమే తప్పు. ప్రభాస్‌(Prabhas) రాముడిగా, కృతి సనన్‌(Kriti sanon) సీతగా, సైఫ్‌ అలీఖాన్‌(Saif ali Khan) రావణుడిగా నటించిన ఆదిపురుష్‌ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. ఓం రౌత్‌(OM Raut) దీనికి దర్శకుడు. సినిమాలో అనేక పొరపాట్లు దొర్లాయని, కొన్ని సన్నివేశాలను రామాయాణానికి విరుద్ధంగా తీశారని విమర్శలు వచ్చాయి. హనుమంతుడికి రాసిన డైలాగులు విని జనం బిత్తరపోయారు. ఇక ఇప్పుడు, ఇన్ని రోజులకు మనోజ్‌ ముంతషిర్‌ శుక్లా క్షమాపణలు కోరాడు. సోషల్‌ మీడియా(social media) వేదికగా తాము చేసిన తప్పును అంగీకరిస్తున్నట్టు తెలిపాడు. 'ఆదిపురుష్‌ సినిమా కారణంగా ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. నా రెండు చేతులు జోడించి మీ అందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ప్రభు బజరంగ్‌బలి మమ్మల్ని ఐక్యంగా ఉంచి, మన పవిత్రమైన సనాతన, గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించుగాక' అంటూ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు మనోజ్‌.

Updated On 8 July 2023 2:42 AM GMT
Ehatv

Ehatv

Next Story