సినిమా అభిమానులు మనోజ్ ముంతషీర్‌ను(Manoj Munthasheer) అంత త్వరగా మర్చిపోలేరు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులైతే, అందులోనూ యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్(Prabhas) అభిమానులైతే కొంతకాలం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లో అతి పెద్ద డిజాస్టర్ ఆదిపురుష్‌కు(Adhipurush) మాటలు రాసింది ఈ మహానుభావుడే!
సినిమా అభిమానులు మనోజ్ ముంతషీర్‌ను(Manoj Munthasheer) అంత త్వరగా మర్చిపోలేరు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులైతే, అందులోనూ యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్(Prabhas) అభిమానులైతే కొంతకాలం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లో అతి పెద్ద డిజాస్టర్ ఆదిపురుష్‌కు(Adhipurush) మాటలు రాసింది ఈ మహానుభావుడే!
అసలు ఈ సినిమాకు వచ్చినన్ని విమర్శలు మరే సినిమాకు రాలేదు. సినిమాలో నటీనటుల వేషధారణల దగ్గర్నుంచి మొదలు పెడితే మాటల వరకు అన్నీ పరమ చెత్తనే! ఇక మనోజ్ ముంతషీర్ పైన అయితే విపరీతమైన ట్రోల్ జరిగింది. ఇతగాడు రాసిన ఓ డైలాగ్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మొదట్లో ఆ డైలాగును సమర్థించుకున్నాడు ముంతషీర్.
తనను విమర్శిస్తున్నవారిని జాతి విద్రోహలని అన్నాడు. అయినప్పటికీ విమర్శలు ఆగకపోవడంతో ఆ డైలాగును తొలగించాల్సి వచ్చింది. ఆ డైలాగు రాసినందుకు ప్రేక్షకులకు క్షమాపణలు కూడా చెప్పాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆదిపురుష్ వల్ల తనకు ఎదురైన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు. ఈ ప్రపంచం ఓ రోజు మనల్ని మంచివాడిగా చూస్తుందని, మరో రోజు చెడ్డవాడిగా చూస్తుందని, కానీ మన కుటుంబానికి మాత్రం మనం ఎప్పటికీ హీరోనే అని ముంతషీర్ పేర్కొన్నాడు. తానొక తప్పు చేశానని, ఆదిపురుష్ సినిమాకు రచయితగా పని చేసి చాలా పెద్ద తప్పు చేశానని అన్నాడు.
దాన్నుంచి ఎంతో నేర్చుకున్నానని, ఇక నుంచి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తానని ముంతషీర్ తెలిపాడు. ఆదిపురుష్ విడుదల తర్వాత తనపై వచ్చిన విమర్శలకు స్పందించకుండా ఉంటే బాగుందని, జనాలు తనపై కోపంతో ఊగిపోతున్న సమయంలో సంయమనంతో మౌనంగా ఉంటే అయిపోయేది అని గతాన్ని నెమరేసుకున్నాడు. కానీ అప్పుడు తనను ఇంకా ద్వేషించారని, చంపుతామని బదిరించారని తెలిపాడు. మరో గత్యంతరం లేక తాను విదేశాలకు వెళ్లిపోయి వివాదం సద్దుమణిగేంత వరకు అక్కడే ఉన్నానని వివరించాడు.
ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన తనకు సెకండ్ ఛాన్స్ కావాలని చెప్పాడు. బాహుబలి హిందీ డబ్బింగ్‌తో పాటు తేరి మిట్టీ, దేశ్ మేరే వంటి ఎన్నో చిత్రాలకు రచయితగా పని చేశానని, అసలు తన పాటలు మోగకుండా రామనవమి, దీపావళి, దసరా పండగలే జరగవని సగర్వంగా చెప్పగలనని మనోజ్ ముంతషీర్ చెప్పాడు.