ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఒకప్పుడు హీరోయిన్.. పుట్టింది లండన్‌లో.. నటించింది మాత్రం తెలుగు సినిమాల్లో...! ఇప్పటికీ గుర్తుపట్టలేదు కదూ! చిన్న హింట్ ఇస్తాను.. నాగార్జున(Nagarjuna), ప్రభాస్‌లతో(Prabhas) జంటగా నటించింది. ఈ రెండు సినిమాల్లో ఒకటి బ్రహ్మండమైన విజయాన్ని సాధించింది. మరోటి యావరేజ్‌గా పోయింది. వీటి తర్వాత ఈమె సినిమాల్లో నటించలేదు.. ఆఫర్లు రాక కాదు. బోల్డన్నీ వచ్చాయి. కానీ ఒకే ఒక్క కారణంతో నటనకు పూర్తిగా దూరమయ్యింది. ప్రస్తుతం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది..

ఎవరికైనా నాలుగు పదుల వయసులో కొత్త అందం సంతరించుకుంటుంది. ఈమె హీరోయిన్ కాబట్టి అదనంగా కొంచెం గ్లామర్ యాడ్ అయ్యింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ యువ హీరోయన్లకు పోటీ ఇచ్చేలా ఉంది కదూ! సారీ .. ఇప్పటికీ పేరు చెప్పలేదు కదూ! అన్షు అంబానీ(Anshu Ambani).. అదేనండి మన్మథుడు(Manmadhudu) సినిమాలో ఓ హీరోయిన్.. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో కనిపించే కథానాయిక ఈమెనే! భారతీయ మూలాలున్న ఈ అందాలభామ లండన్‌లో పుట్టి పెరిగింది. చదువుతున్నప్పుడే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. హీరోయిన్ కావాలనుకుంది. ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ ప్రయత్నాలు ఫలించి రాఘవేంద్ర(Raghavendra) అనే సినిమాలో హీరోయిన్ వేషాన్ని దక్కించుకుంది. అందులో ప్రభాస్ హీరోగా నటించాడు. ఈ సినిమా కంప్లీట్ అయ్యేలోపుగానే నాగార్జున నటించిన మన్మథుడులో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. తెలుగులో రెండంటే రెండే సినిమాలు చేసింది. మిస్సమ్మలో చిన్న పాత్రలో కనిపిస్తుందంతే! తమిళంలో జై(Jai) అనే మూవీ చేసింది. ఈ క్రమంలో ఈమెకు బోల్డన్నీ ఆఫర్లు వచ్చాయి. అగ్ర కథానాయకులతో నటించే అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని ఆమె అంగీకరించలేదు. తిరిగి లండన్‌కు వెళ్లిపోయింది. అందుకు కారణం చేసింది చాలని ఆమె అనుకోవడం.. సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉన్నా.. కేవలం ఒకట్రెండు సినిమాలు చేస్తే చాలని ముందే డిసైడ్ అయ్యిందట! అలా తను అనుకున్న టార్గెట్ పూర్తి కాగానే వెనక్కి వెళ్లిపోయింది. లండన్‌కు వెళ్లిపోయిన అన్షు అక్కడ సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ప్రస్తుతం ఈమె ఇండియన్ డిజైనర్ వేర్ బిజినెస్ చేస్తున్నారు. ఫ్రీ టైమ్‌లో జిమ్ వర్క్ అవుట్లు, గ్లామరస్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటారు.