✕
Manjummel Boys : డెవిల్ కిచెన్ మనుషులను మింగేస్తుందా? ఆ గుహలోకి వెళ్లిన 16 మంది ఏమయ్యారు?
By EhatvPublished on 6 April 2024 2:13 AM GMT
ఫిబ్రవరి చివరివారంలో ఓ మళయాల చిత్రం విడుదలయ్యింది. ఆ సినిమా పేరు మంజుమ్మెల్ బాయ్స్(Manjummel Boys). 20 కోట్ల రూపాయలతో తీసిన ఆ సినిమా ఇప్పటికే 230 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసింది. దక్షిణ భారతమంతా ఆ సినిమా ఊసేస్తోంది. వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన ఈ సర్వైవల్ డ్రామాను ఇవాళ్టి నుంచి తెలుగులో కూడా చూడొచ్చు.

x
Manjummel Boys
-
- ఫిబ్రవరి చివరివారంలో ఓ మళయాల చిత్రం విడుదలయ్యింది. ఆ సినిమా పేరు మంజుమ్మెల్ బాయ్స్(Manjummel Boys). 20 కోట్ల రూపాయలతో తీసిన ఆ సినిమా ఇప్పటికే 230 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసింది. దక్షిణ భారతమంతా ఆ సినిమా ఊసేస్తోంది. వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన ఈ సర్వైవల్ డ్రామాను ఇవాళ్టి నుంచి తెలుగులో కూడా చూడొచ్చు. అత్యంత ప్రమాదకరమైన గుహలో ఇరుక్కుపోయిన తన మిత్రుడిని రక్షించుకోవడానికి ఓ యువకుడు చేసిన సాహసమే చిత్ర మూల కథ.
-
- ఈ సినిమాకు నేపథ్యం గుణ గుహలు(Guna Caves). ఆ గుహల చుట్టూ అంతు చిక్కని మార్మికత ఉంది. ఇప్పటికీ వీడని ఓ మిస్టరీ ఉంది. తమిళనాడు కొడైకెనాల్లో(Kodaikanal) గుణగుహలు ఉన్నాయి. 1821లో బీఎస్ వార్డ్ అనే బ్రిటిష్ అధికారి ఈ గుహలను కనుగొన్నారు. ఆయనే వీటికి డెవిల్స్ కిచెన్(Devil kitchen) అనే పేరు పెట్టారు. అసలు ఆయన ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియదు. ఈ పేరుకు సంబంధించి డ్యాక్యుమెంట్లు కూడా లేవు. అన్నట్టు ఈ గుహలలో పాండవులు నివసరించారనే కథనం కూడా ఉంది.
-
- 1991లో కమలహాసన్ హీరోగా వచ్చిన గుణ సినిమాలో చాలా భాగం ఇక్కడే చిత్రీకరించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. అప్పట్నుంచి ఈ గుహలకు గుణ గుహలు అనే పేరు వచ్చింది. గుణ సినిమా తర్వాత టూరిస్టులు కూడా బాగా పెరిగారు. పర్యాటకులు అయితే పెరిగారు కానీ, ఆ ప్రమాదకరమైన గుహలకు వెళ్లే సాహసం మాత్రం చేయరు. ఆ గుహలో అతి పెద్ద అగాథం ఉంది. దాని అంతు చూసేందుకు కొందరు సాహసికులు ప్రయత్నించారు కానీ, వారు తిరిగిరాలేదు. ఆ గుహ వారిని మింగేసింది. పొరపాటున ఆ గుహలో పడితే అంతే సంగతులు. శవాలు కూడా దొరకవు! బహుశా ఇందుకే కాబలు వార్డు వీటికి డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టింది. 2016 వరకు 16 మంది ఈ గుహలోకి వెళ్లి మళ్లీ వెనక్కి రాలేదు. ఇలా అదృశ్యమైన వారిలో ఓ కేంద్రమంత్రి బంధువు కూడా ఉన్నారు.
-
- ఆ గుహలోకి వెళ్లినవారిలో ఇప్పటి వరకు ఒకే ఒక్క వ్యక్తి సజీవంగా బయటకు రాగలిగాడు. మంజుమ్మెల్ బ్యాయ్స్ సినిమాకు ప్రేరణ అతడే! 2006లో కేరళ కొచ్చికి చెందిన ఓ ఆర్ట్స్ క్లబ్ స్నేహితుల బృందం కొడైకనాల్ సందర్శనకు వెళతారు. ఆ బృందంలో ఒకరు గుణ గుహల గురించి చెబుతాడు. వెంటనే వారంత గుణగుహల అంతుచూద్దామని అనుకుంటారు.టూరిస్ట్ గైడు వద్దని ఎంత చెప్పినా వినకుండా గుహలో అడుగుపెడతారు.అందులో సుభాష్ అనే వ్యక్తి గుహ అగాథంలో పడిపోతాడు. మిగతా స్నేహితులందరూ అతడి మీద ఆశలు వదిలేసుకుంటారు. అక్కడ్నుంచి వెళ్లిపోదామనుకుంటారు. కానీ సిజూ డేవిడ్ అనే ఓ వ్యక్తికి మాత్రం తన స్నేహితుడిని అలా వదిలేసి వెళ్లిపోవడానికి మనస్కరించదు. పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నా వినకుండా స్థానికుల సహాయ సహకారాలతో అతి కష్టంమీద తన స్నేహితుడు సుభాష్‌ను రక్షించుకుంటాడు.
-
- ఆ వాస్తవ ఘటన ఆధారంగానే మంజుమ్మెల్ బాయ్స్‌ను నిర్మించారు. ఈ గుహలోకి వెళ్లడానికి సందర్శకులకు అనుమతి లేదు. కొన్ని దశాబ్దాల కిందటే ఈ గుహను శాశ్వతంగా మూసేశారు. అయినా కొందరు హెచ్చరికలను పట్టించకుండా గుహ పరిసరాలకు వెళుతుంటారు. ఇప్పుడు మంజుమ్మెల్ బాయ్స్ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని సాధించడంతో గుణ గుహలు మళ్లీ తెరచుకున్నాయి.తమిళనాడు టూరిజం శాఖ సందర్శకులను అనుమతిస్తోంది. టూరిస్టులతో ఆ ప్రాంతం మళ్లీ కళకళలాడుతోంది. అయితే ఎందుకైనా మంచిదని గుహ ప్రధాన ద్వారాన్ని మాత్రం మూసే ఉంచారు. మంజుమ్మెల్ బాయ్స్ సినిమా షూటింగ్ చాలా వరకు సెట్స్‌లోనే జరిగింది. ఎందుకంటే గుణ గుహలు ఎంత ప్రమాదమైనవో తెలుసుకాబట్టి. కమలహాసన్ గుణ సినిమా తర్వాత 2010లో మోహన్‌లాల్ హీరోగా వచ్చిన షికార్ సినిమాలో కొంత భాగాన్ని డెవిల్స్ కిచెన్ గుహల పరిసరాలలో తీశారు. ఈ సినిమాలో అక్కడక్కడ తెలుగుమాటలు, తెలుగు పాట ఉండటం గమనార్హం.

Ehatv
Next Story