వర్షం(Varsham) సినిమా వచ్చి సుమారు రెండు దశాబ్దాలు అవుతుంది. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన త్రిష(Trisha) అప్పుడెలా ఉన్నారో ఇప్పుడూ అలాగే చెక్కు చెదరని అందంతో మెరిసిపోతున్నారు. నాలుగు పదుల వయసులోనూ యువ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తున్నారు. ఇప్పుడామెకు అవకాశాలకు కొదవలేదు. పొన్నియన్ సెల్వన్(Ponniyin Selvan) చిత్రం ఆమెకు మళ్లీ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది.

Trisha Krishnan
వర్షం(Varsham) సినిమా వచ్చి సుమారు రెండు దశాబ్దాలు అవుతుంది. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన త్రిష(Trisha) అప్పుడెలా ఉన్నారో ఇప్పుడూ అలాగే చెక్కు చెదరని అందంతో మెరిసిపోతున్నారు. నాలుగు పదుల వయసులోనూ యువ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తున్నారు. ఇప్పుడామెకు అవకాశాలకు కొదవలేదు. పొన్నియన్ సెల్వన్(Ponniyin Selvan) చిత్రం ఆమెకు మళ్లీ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. మొదటిభాగం ఎంత పెద్ద హిట్టయ్యిందో రెండో భాగం కూడా అదే రేంజ్‌లో సూపర్‌హిట్టయ్యింది. ఈ సినిమాకు ముందు త్రిష సినిమాలు ఆశించినమేర విజయాలు సాధించలేకపోయాయి. ఈ చెన్నై భామకు మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాతో చాలా పెద్ద బ్రేక్ ఇచ్చారు. ఇందులో త్రిష నటనకు ప్రశంసలు దక్కాయి.
ప్రస్తుతం దళపతి విజయ్(Thalapathy Vijay) సరసన లియో(Leo) సినిమాలో నటిస్తున్నారు. అలాగే అజిత్(Ajith) హీరోగా నటించనున్న విడాముయిర్చి(Vidamuyirchi) సినిమాలోనూ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సరసన నటించే అవకాశం కూడా త్రిషకు లభించింది. మరికొంత మంది నిర్మాత, దర్శకులు త్రిష కాల్షీట్ల కోసం కాచుకుని ఉన్నారు. ఇలాంటి సమయంలో త్రిషకు దర్శకుడు మణిరత్నం(Mani Ratnam) నుంచి మరో అవకాశం వచ్చిందని తెలుస్తోంది. ఆయన మద్రాస్ టాకీస్(Madras Talkies) పతాకంపై సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్‌గా ఆయన నిర్మించే సినిమాలో త్రిషను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
