గత ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన 'పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ (Ponniyin Selvan 1) తమిళంలో బిగ్గెస్ట్ హిట్‏గా నిలిచింది. అక్కడ ఏకంగా 500 కోట్ల రూపాయల వరకు వసూళ్లను రాబట్టింది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష వంటి భారీ స్టార్ కాస్టింగ్‏లో వచ్చిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) మ్యూజిక్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్‏గా మార్చివేశాయి.

గత ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన 'పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ (Ponniyin Selvan 1) తమిళంలో బిగ్గెస్ట్ హిట్‏గా నిలిచింది. అక్కడ ఏకంగా 500 కోట్ల రూపాయల వరకు వసూళ్లను రాబట్టింది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష వంటి భారీ స్టార్ కాస్టింగ్‏లో వచ్చిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) మ్యూజిక్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్‏గా మార్చివేశాయి. అయితే తమిళ రైటర్ కల్కి రాసిన 'పొన్నియిన్ సెల్వన్' నోవెల్ ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) తెరకెక్కించారు. ఫస్ట్ పార్ట్ కేవలం ట్రైలర్ మాత్రమేనని.. సెకండ్ పార్ట్ మరింత అందంగా ఉంటుందని మూవీ ప్రమోషన్స్‏లో అన్నారు. మరి వాళ్లన్నట్టు పొన్నియిన్ సెల్వన్ సెకండ్ పార్ట్ హిట్ అయిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

వల్లవరాయ వందియ దేవుడు (కార్తీ) పొన్నియిన్ సెల్వన్ (జయం రవి), చోళుల నౌకపై వెళ్తుండగా వాళ్లపై ఎటాక్ జరగడంతో వందియదేవుడు నీటిలో మునిగిపోవడంతో ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది. సెకండ్ పార్ట్ ని ఆదిత్య కరికాలుడు (విక్రమ్), నందిని (ఐశ్వర్యరాయ్ బచ్చన్) చైల్డ్ హుడ్ లవ్ స్టోరీతో మొదలవుతుంది. ఆ ఫ్లాష్‏బ్యాక్ తర్వాత నీళ్లల్లో మునిగిపోయిన వందియదేవుడు, పొన్నియన్ సెల్వలను పూంగుళి (ఐశ్వర్యలక్ష్మి) కాపాడుతుంది. ఆదిత్య కరికాలుడు, కుందవై, పొన్నియిన్ సెల్వన్‏లను చంపడానికి నందిని.. పాడ్యులతో కలిసి స్కెచ్ వేస్తుంది. ఆ స్కెచ్ అర్కౌట్ అయిందా ? చోళనాడుకి లాస్ట్‏కి ఎవరు కింగ్ అయ్యారు ? మిగతా కథ.

పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) తమిళంలో పెద్ద హిట్ సాధించినప్పటికీ తెలుగులో మాత్రం మన ఆడియన్స్‏కు అంతగా రీచ్ అవ్వలేకపోయింది. స్త్ర్కీన్ మీద ఎక్కువ క్యారెక్టర్స్ కనిపించడం, ఒక్కో క్యారెక్టర్‏కు మల్టిపుల్ పేర్లు ఉండటంతో ఇవన్నీ కథపై ఆసక్తిని చూపించలేకపోయాయి. సినిమా మొదట్లో పెద్ద ఆడియన్స్ మైండ్‏కు ఎక్కకపోయినా.. ఆ తర్వాత వచ్చిన ఆరు నెలల గ్యాప్‏తో ఆ లోటు ఫుల్‏ఫిల్ అయింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్‏లో సినిమా ఓపెనింగ్‏తోనే స్టోరీలోకి తీసుకెళ్లాడు డైరెక్టర్. ఆదిత్య కారికారుడు, నందిల ప్రేమకథ తెరపై చాలా అందంగా కనిపిస్తుంది మనకు. పొన్నియిన్ సెల్వన్ చనిపోయాడని ఆ ఫ్యామిలీ పడే పెయిన్, ఇదే అవకాశంగా రాజ్యం కోసం శత్రువుల పన్నాగాలు, మరోవైపు శ్రీలంకలో వందియదేవుడు పొన్నియిన్ సెల్వన్‏ను కాపాడుకోవడానికి మధ్య జరిగే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఫస్టాఫ్ ఇంట్రెస్టింగ్ ఉందనుకులోపే సెకండాఫ్ కాస్త మన సహనాన్ని పరీక్షిస్తుంది. స్టోరీలోని మెయిన్ క్యారెక్టర్స్ మధ్య డ్రామా పండించడానికి ప్రయత్నించినా అదికాస్త ల్యాగ్ అనిపిస్తుంది. విక్రమ్ (Vikram) , ఐశ్వరాయ్ సీన్స్ అయితే చాలా బావున్నాయనే చెప్పాలి. నందిని క్యారెక్టర్‏తో ట్విస్టులు మనల్ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తాయి. చివరి క్లైమాక్స్ ఏదో ఒకలా ముగించాలన్నట్టు 'మీకు అంతగా కావాలంటే' అన్నట్టు మన కోసం ఓ ఫైట్ సీన్‏ని ఇంజెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. విజువల్ క్వాలిటీ కూడా అక్కడక్కడా మనల్ని ఇబ్బందిపెడుతుంది. సినిమాలో మనకు నటీనటులకు క్లోజ్ అప్ షాట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అదిరిపోయిందని చెప్పాలి. ఈ సినిమాకు రూ. 500 కోట్లు బడ్జెట్ అని ఆ మధ్య వార్తలొచ్చాయి కానీ ఎక్కడా ఆ బడ్జెట్ కనిపించినట్టు అనిపించలేదు. ఇక ఆర్టిస్టులు ఐశ్వరాయ్ తన పాత్రకు ప్రాణం పెట్టింది, కార్తీ, త్రిష లవ్ సీన్స్ లో ఇద్దరు బాగా చేశారు. ఓవరాల్‏గా చెప్పాలంటే ఫస్ట్ పార్ట్‏తో పోలిస్తే.. సెకండ్ పార్ట్ చిత్రం ఒకసారి చూడొచ్చు. పీరియాడికల్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ సినిమాను అస్సలు మిస్సవ్వకండి..

Updated On 28 April 2023 5:08 AM GMT
Ehatv

Ehatv

Next Story