బెంగళూరు రేవ్ పార్టీ(Bangalore Rave Party) కేసులో అరెస్టయిన టాలీవుడ్ నటి హేమను(Hema) మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(Movie artist Association) సస్పెండ్(Suspend) చేసింది. హేమను మా నుంచి సస్పెండ్ చేయాలా వద్దా అనే దానిపై సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోవాలనుకున్నారు ప్రెసిడెంట్ మంచు విష్ణు(Manchu vishnu).

Hema Suspension
బెంగళూరు రేవ్ పార్టీ(Bangalore Rave Party) కేసులో అరెస్టయిన టాలీవుడ్ నటి హేమను(Hema) మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(Movie artist Association) సస్పెండ్(Suspend) చేసింది. హేమను మా నుంచి సస్పెండ్ చేయాలా వద్దా అనే దానిపై సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోవాలనుకున్నారు ప్రెసిడెంట్ మంచు విష్ణు(Manchu vishnu). మా అసోసియేన్ గ్రూపులో మంచు విష్ణు పెట్టిన మెసేజ్‌కు హేమను సస్పెండ్ చేయాల్సిందేనంటూ సభ్యులంతా రిప్లయ్ ఇచ్చారట! సభ్యుల అభిప్రాయం మేరకు హేమను సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. హేమకు క్లీన్ చిట్ వచ్చేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్న విషయం, వైద్య పరీక్షలో ఆమెకు పాజిటివ్ రావడం తెలిసిందే. మొన్ననే హేమను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
