అతిపెద్ద సాహసం చేయబోతున్నారు మంచువారి(Manchu Family Son) వారసుడు.. హీరో మంచు విష్ణు(Manchu vishnu). ఇప్పటికే చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నా... భారీ బడ్జెట్ తో.. తన కలల ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశాడు.

Manchu Vishnu
అతిపెద్ద సాహసం చేయబోతున్నారు మంచువారి(Manchu Family Son) వారసుడు.. హీరో మంచు విష్ణు(Manchu vishnu). ఇప్పటికే చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నా... భారీ బడ్జెట్ తో.. తన కలల ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశాడు.
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన కలల ప్రాజెక్టు 'కన్నప్ప'ను(Bhakta Kannappa') పట్టాలెక్కించారు. కన్నప్ప సినిమా ఈరోజు(అగస్ట్ 18) హైదరాబాదులో ఘనంగా స్టార్ట్ అయ్యింది. అయితే ఈసినిమాకు మంచు మోహన్ బాబు(Manchu Mohan babu) నిర్మాత గా వ్యవహరిస్తుండగా ముఖేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar SIngh) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మంచు విష్ణు సరసన నుపుర్ సనన్(Nupur Sanan) హీరోయిన్ గా నటిస్తోంది.
అవా ఎంటర్టయిన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపుదిద్దుకోనుంది కన్నప్ప సినిమా ఈ ఎపిక్ మూవీపై చిత్రబృందం పూర్తి విశ్వాసంతో ఉంది. గతంలో కృష్ణంరాజు హీరోగా వచ్చిన 'భక్త కన్నప్ప' ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు తాజా హంగులతో మంచు విష్ణు తీస్తున్న 'కన్నప్ప' చిత్రానికి రూ.150 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారు. అని తెలుస్తోంది. ఇక ఈసినిమాకు సబంధించిన ఇతర వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
శ్రీకాళహస్తి(Srikalahasti) పుణ్యకేత్రంలో పూజా కార్యక్రమాలతో కన్నప్ప చిత్రం ప్రారంభం అయింది. మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది. దర్శకులు ఇతర వివరాలని కూడా చిత్ర యూనిట్ మూవీ లాంచ్ సందర్భంగా ప్రకటించారు.
తన కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా అని మంచు విష్ణు ఇటీవల తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాను దాదాపు 5 భాషలకు పైగానే రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ లాంటి రచయితలు రెండేళ్ల పాటు స్క్రిప్ట్ పై వర్క్ చేసి కథని పూర్తి చేశారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాస్సయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మంచు విష్ణు ఈ చిత్రం సినిమాటిక్ గా అద్భుతంగా మాత్రమే కాదు.. భక్తిపారవస్యం నింపే విధంగా రావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. తన డ్రీమ్ ప్రాజెక్టు కోసం ప్రాణం పెట్టి నటించేందుకు విష్ణు సిద్ధం అయ్యారు.
