మహా శివరాత్రి(Maha Shivaratri) పండుగను సందర్భంగా కన్నప్ప ఫస్ట్‌లుక్‌(kannappa first look)ను మేకర్స్‌ విడుదల చేశారు. కన్నప్పగా మంచు విష్ణు(Manchu Vishnu) నటిస్తున్నారు. ఈ పోస్టర్‌లో విష్ణు బాణాన్ని సంధిస్తూ కనిపిస్తున్నాడు. ఫస్ట్‌ లుక్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. కన్నప్ప సినిమా(kannappa movie)ను ఓ దృశ్య కావ్యంగా మలుస్తున్నారు.

మహా శివరాత్రి(Maha Shivaratri) పండుగను సందర్భంగా కన్నప్ప ఫస్ట్‌లుక్‌(kannappa first look)ను మేకర్స్‌ విడుదల చేశారు. కన్నప్పగా మంచు విష్ణు(Manchu Vishnu) నటిస్తున్నారు. ఈ పోస్టర్‌లో విష్ణు బాణాన్ని సంధిస్తూ కనిపిస్తున్నాడు. ఫస్ట్‌ లుక్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. కన్నప్ప సినిమా(kannappa movie)ను ఓ దృశ్య కావ్యంగా మలుస్తున్నారు. ఓ ధైర్యవంతుడైన యోధుడు, మహాశివుడి పరమభక్తుడు అయిన కన్నప్ప కథను తెరమీదకు తెస్తున్నారు. ఈ పోస్టర్ పాత్రలోని ధైర్యాన్ని, కారెక్టర్‌లోని డెప్త్‌ను, ఇంటెన్సిటీని చూపిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం గ్యారంటీ. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేసిన పోస్టర్ ఆకర్షణీయంగా ఉంది. కన్నప్పపై భారీ అంచనాలుండగా.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మరింత బజ్ పెరిగింది. కన్నప్పను తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భక్తి పురాణ గాథను ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Updated On 8 March 2024 5:40 AM GMT
Ehatv

Ehatv

Next Story