టాలీవుడ్ నటుడు, మంచు విష్ణు MAA (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికయ్యారు

టాలీవుడ్ నటుడు, మంచు విష్ణు MAA (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికయ్యారు. ఆ పదవికి 2 సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేసిన విష్ణు.. ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో జరిగిన MAA ఎన్నికల్లో ఇదే పదవికి నటుడు ప్రకాష్ రాజ్‌ పోటీ చేయగా విష్ణు గెలుపొందారు. ఈసారి ప్రకాష్ రాజ్ పోటీకి దూరంగా ఉండటంతో విష్ణు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలుస్తోంది. మా భవనం పూర్తయ్యే వరకు MAA అధ్యక్షుడిగా మంచు విష్ణు వ్యవహరించాలని ఇతర నటీనటులు కూడా కోరుకుంటూ ఉన్నారు. మనం మళ్లీ మంచు విష్ణును MAA అధ్యక్షుడిగా చూడవచ్చు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు అంటే చాలు ఎక్కడ లేని హై డ్రామా కొనసాగేది. టీవీలకు ఎక్కేవారు.. ప్రెస్ మీట్స్ పెట్టి ఒకరినొకరు తిట్టిపోసే వారు. మంచు విష్ణును ఎన్నుకునే సమయంలో జరిగిన హై డ్రామా కూడా అంతా ఇంతా కాదు. మా సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయి నానా రచ్చ చేశారు. అయితే మంచు విష్ణు విజయం సాధించాక అందరినీ కలుపుకుంటూ పోయారు. మా భవనం కూడా నిర్మిస్తానని మంచు విష్ణు చెప్పడంతో ఈసారి ఎన్నికలు వద్దని మా సభ్యులు నిర్ణయించుకున్నారు. మంచు విష్ణు పనితీరు కూడా బాగుందంటూ ప్రశంసలు దక్కాయి.

Updated On 8 April 2024 9:24 PM GMT
Yagnik

Yagnik

Next Story