చాలా రోజుల తర్వాత మంచు మనోజ్‌(Manchu Manoj )మీడియా ముందుకొచ్చాడు. ప్రెస్‌మీట్‌లో మైక్‌ అందుకున్న ఓ రిపోర్టర్‌ గతంలో మంచు విష్ణు(Manchu Vishnu)తో జరిగిన గొడవపై ప్రశ్నించబోయాడు. ఆ ప్రశ్న పూర్తి కాకముందే వెనుక నుంచి స్టాప్‌ రయ్యిమంటూ వచ్చేసి జర్నలిస్టు చేతిలోంచి మైక్‌ లాక్కున్నాడు.

చాలా రోజుల తర్వాత మంచు మనోజ్‌(Manchu Manoj )మీడియా ముందుకొచ్చాడు. ప్రెస్‌మీట్‌లో మైక్‌ అందుకున్న ఓ రిపోర్టర్‌ గతంలో మంచు విష్ణు(Manchu Vishnu)తో జరిగిన గొడవపై ప్రశ్నించబోయాడు. ఆ ప్రశ్న పూర్తి కాకముందే వెనుక నుంచి స్టాప్‌ రయ్యిమంటూ వచ్చేసి జర్నలిస్టు చేతిలోంచి మైక్‌ లాక్కున్నాడు. అయ్యా తాను వివాదం గురించి అడగడం లేదని, ప్రశ్న పూర్తయ్యేవరకు ఆగాలని రిపోర్టర్‌ రిక్వెస్ట్‌ చేశాడు. అయినప్పటికీ పీఆర్వో మాత్రం అసలు పట్టించుకోలేదు. నిర్దాక్షిణ్యంగా మైక్‌ లాగేసుకున్నాడు. మంచు విష్ణుతో జరిగిన గొడవపై మంచు మనోజ్‌కు స్పందించాలని ఉన్నప్పటికీ ఆయన ఉద్యోగులకు ఇష్టం లేనట్టుగా ఉంది. మనోజ్‌ కంటే వీరే ఎక్కువ ఫీలవుతున్నట్టుగా ఉంది. మంచు విష్ణు, మంచు మనోజ్‌ మధ్య అభిప్రాయభేదాలున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో మంచు మనోజ్‌కు చెందిన మనుషులపై మంచు విష్ణు దాడికి దిగాడు. ఆ వీడియోను మంచు మనోజ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే మోహన్‌బాబు(Mohan Babu) చెప్పడంతో ఆ వీడియోను తొలగించాడు. ఆ తర్వాత ఇదే విషయంపై మంచు విష్ణుపై అడిగితే దాన్ని చాలా లైట్‌గా తీసుకున్నాడు. మంచు మనోజ్‌ను అడిగితే ఆ గొడవపై తాను స్పందించలేనని, వారినే అడగాలంటూ తప్పించుకున్నాడు. అప్పుడు కూడా ఆయన స్టాఫ్‌ అత్యుత్సాహం చూపించారు. మంచు విష్ణు, మంచు మనోజ్‌ మధ్య గొడవలు మాత్రం నిజమేనని చాలా మంది నమ్ముతున్నారు. ఆస్తి పంపకాల వరకు వెళ్లిందని సోషల్‌ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. మోహన్‌బాబు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో కనిపించడంతో ఈ ఊహాగానాలకు ఊతం వచ్చింది. అక్కడ మీడియాను మోహన్‌బాబు కసురుకోవడం చూశాం. ఇది వాళ్ల కుటుంబ వ్యహారం కావొచ్చు కానీ మంచు మనోజ్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియో కారణంగా మీడియాకు ఆసక్తి పెరిగింది. అందుకే మీడియా ప్రశ్నలడుగుతున్నది. జవాబు చెప్పడం ఇష్టం లేకపోతే నో కామెంట్‌ అని చెప్పి తప్పించుకోవచ్చు. కానీ ఇలా జబర్దస్త్‌గా మైక్‌ లాక్కోవడం మాత్రం మంచిది కాదని కొందరు అంటున్నారు.

Updated On 7 Dec 2023 12:22 AM GMT
Ehatv

Ehatv

Next Story