గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న విభేదాల గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ వివాదంపై జనాలను కన్ ఫ్యూజ్ చేస్తూ వస్తున్నారు మంచు ఫ్యామిలీ. గొడవ జరిగిందని ఒక సారి. అసలు జరగలేదని ఒక సారి.
గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో(Manchu Family) జరుగుతున్న విభేదాల గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ వివాదంపై జనాలను కన్ ఫ్యూజ్ చేస్తూ వస్తున్నారు మంచు ఫ్యామిలీ. గొడవ జరిగిందని ఒక సారి. అసలు జరగలేదని ఒక సారి.. ఇదంత రియాల్టీ షో అని ఒకసారి... కుటుంబంలో గొడవలు కామన్ అంటూ ఒకసారి.. ఇలా రకరకాలుగా చెప్పి ఏ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. దాంతో మంచువారి వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
మంచు మనోజ్(Manchu Manoj)-మంచు విష్ణులు(Manchu Vishnu) విడిపోతున్నారు అన్న న్యూస్ టాలీవుడ్ లో(Tollywood) తెగ వైరల్ అయ్యింది. అయితే ఈ గొడవను కవర్ చేసే ప్రయత్నం కూడా చేశారు మంచు విష్ణు. ఇదంతా ఓ రియాల్టీ షోలో(Reality show) భాగం అని.. ఆ వీడియో ఓ షో కోసం చేశామంటూ విష్ణు కవర్ చేసే ప్రయత్నం చేశాడు. దాంతో ఇంకా తీవ్ర స్థాయిలో విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి.దాంతో అసలు విషయంపై ఇంకా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆ విషయంపై క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేసింది మీడియా. అందులో భాగంగానే తిరుపతిలో ఓ హస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన మోహన్ బాబు, మనోజ్ లను ప్రశ్నించగా.. మీడియాతో మనోజ్ వెటకారంగా మాట్లాడాడు
గత కొంతకాలంగా మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఫ్యామిలీలో జరుగుతున్న పరిస్థితులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మంచు కుటుంబంలో రేగిన వివాదంపై స్పష్టత ఇవ్వాలని విలేకర్లు అడిగారు. ఈ ప్రశ్నపై మోహన్ బాబు కూల్ గా మాట్లాడుతూనే.. తీవ్ర అసహనం చూపించాడు. కుటుంబంలో జరిగిన గొడవలను ఇలా బహిరంగంగా అడగం భావ్యం కాదని అన్నారు మోహాన్ బాబు. మీరంటే నాకు చాలా ఇష్టం.. మీకూ కుటుంబాలు ఉన్నాయి.. ఆ విషయాలు బయట మాట్లాడగలుగుతారా.. అంటూ సమాధానం ఇచ్చాడు మోహన్ బాబు.
ఇక మోహన్ బాబు తరువాత మాట్లాడిన మనోజ్.. తన సినిమా డీటెయిల్స్ గురించి మాట్లాడారు.నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు..షూటింగ్ విషయాలు పంచుకున్నారు మనోజ్. ఇక విలేకరులు రీసెంట్ గా జరుగుతున్న పరిణామాల గురించి క్లారిటీ ఇవ్వాలని అడగ్గా.. మనోజ్ వెటకారంగా మాట్లాడాడు. నాకు చిన్న సెగగడ్డ వచ్చింది... వచ్చి గోకుతారా? అంటూ వెటరకారం చేశాడు. మరి ఇప్పుడు ఇదే రీసెంట్ ఇష్యూ అంటూ చంక ఎత్తి చూపిస్తూ.. ఇక్కడే అయ్యిందిసెగగడ్డ అని వ్యంగ్యంగా మాట్లాడాడు.
దాంతో మీడియా ప్రతినిధులు మనోజ్ పై ఫైర్ అవుతున్నారు.