మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు మంచు మనోజ్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. ప్రత్యేకంగా బహుమతులు పంపించి షాక్ ఇచ్చారు. ఇంతకీ వారు ఏం బహుమతులు పంపించారు.. మనోజ్ రియాక్షన్ ఏంటీ..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) దంపతులు మంచు మనోజ్(Manchu manoj) కు సర్ ప్రైజ్ ఇచ్చారు. ప్రత్యేకంగా బహుమతులు పంపించి షాక్ ఇచ్చారు. ఇంతకీ వారు ఏం బహుమతులు పంపించారు.. మనోజ్ రియాక్షన్ ఏంటీ..?
మంచు మనోజ్ దిల్ ఖుష్ అయ్యాడు. తన కోసం మెగా హీరో రామ్ చరణ్ తో పాటు ఆయన సతీమణి ఉపాసన స్పెషల్ గా గిఫ్ట్స్ పంపించడంతో.. సంతోషం తట్టుకోలేకపోయాడు. వెంటనే సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ప్రత్యేకంగా పోస్ట్ పెట్టి మరీ.. రామ్ చరణ్ దంపతులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు.
ఓనెల రోజుల క్రితం మౌనికా రెడ్డిని(mounika reddy) పెళ్లాడాడు.. టాలీవుడ్ హీరో.. మంచు మనోజ్. కొద్ది మంది బందువులు మధ్య జరిగిన ఈ వేడుకకు ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో బిజీగా ఉండటంతో రామ్ చరణ్ దంపతులు ఈ వేడుకకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో మనోజ్ దంపతులకు ప్రత్యేక బహుమతులు పంపారు. అది కూడా నెల రోజుల తరువాత ప్రత్యేక బహుమతులతో .. రామ్ చరణ్, ఉపాసన దంపతులు సర్ ప్రైజ్ ఇచ్చి మనోజ్ ను సంతోషపెట్టారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా మంచు మనోజ్ వెల్లడించారు. చెర్రీ దంపతులు పంపిన బహుమతులను షేర్ చేసిన ఆయన.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
బహుమతుల ఫోటోలు షేర్ చేసిన మనోజ్ ఇలా రాసుకొచ్చాడు. ఇలాంటి సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఎంతో ప్రేమతో కూడుకుని ఉంటాయి. మాపై ప్రేమను చూపిన స్వీట్ కపుల్ రామ్ చరణ్, ఉపాసనకు ధన్యవాదాలు. లవ్ యూ మిత్రమా. మీరు ఫారిన్ ట్రిప్ ముగించుకుని రాగానే.. మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. మీ ట్రిప్ అద్భుతంగా సాగాలి అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంచు మనోజ్, మౌనికా రెడ్డి వివాహం ట్విస్ట్ ల మధ్య జరిగింది. ఈ పెళ్ళి మంచు విష్ణుకి, మోహన్ బాబుకి ఇష్టం లేనట్టు ప్రచారం జరుగుతుంది. చివరిగా మోహన్ బాబు పెళ్ళిలో కనిపించి సర్ ప్రైజ్ చేశారు. విష్ణు కూడా వచ్చారు కాని.. ఏదో గెస్ట్ లాగా వచ్చి వెల్లారు. దాంతో మంచువారి ఇంట్లో లుకలుకలు బయట పడ్డాయి. ఇక ఇంట్లో వారికి ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకున్న మనోజ్.. తన ఆత్మీయులు ఇలా అండగా ఉండి.. సపోర్ట్ చేస్తుండటంతో.. హ్యాపీ ఫీల్ అవుతున్నాడు.