మంచు మనోజ్ - భూమా మౌనికరెడ్డి వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇటు మంచు మనోజ్- అటు భూమా కుటుంబాలకు చెందిన కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లిపీటలెక్కారు. ఈ పెళ్లి వేడుకకు మోహన్‌బాబు దంపతులు, మంచు లక్ష్మి, కుటుంబ సభ్యులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
గతంలో వీరిద్దరి పెళ్లి విషయంపై చాలా రూమర్స్ వచ్చాయి. అన్నీ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నా.. కొంత కాలం సైలెంట్ గా ఉన్న వీళ్లు ఇద్దరూ అఫిషియల్ గా మార్చి 3న పెళ్లి చేసుకుని ఆ వార్తలకు చెక్ పెట్టేశారు. హైదరాబాద్ ఫిలింనగర్లో మంచు లక్ష్మీ ఇంట్లో వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లి ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. అయితే గత ఏడాది వినాయక చవితి సందర్భంగా సీతాఫల్మండి గణేష్ మండపంలో వీరిద్దరూ కనిపించారు.
ఇక అప్పటి నుంచి మనోజ్-మౌనిక రిలేషన్ షిప్లో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం బయటికి వచ్చింది. ఇక ఆ తర్వాత డిసెంబర్లో అమీన్‌పీర్ దర్గాను వీళ్లు దర్శించుకున్నారు. ఇక 2015లో మంచు మనోజ్ హైదరాబాద్‌కు చెందిన ప్రణతిరెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2019లో వీళ్లిద్దరూ వివాహ బంధానికి ముగింపు పలికారు.
ఇక అప్పటి నుంచి మనోజ్ మళ్లీ పెళ్లి చేసుకుంటాడా లేదా అనే విషయంపై చర్చలు కూడా జరిగాయి. ఇటు మనోజ్ ఫ్యాన్స్ కూడా ‘మళ్లీ పెళ్లెప్పుడు అన్నా’ అని సోషల్ మీడియాలో అడిగిన సందర్భాలు ఉన్నాయి. నాలుగేళ్ల తర్వాత నంద్యాలలోని ఆళ్లగడ్డకు చెందిన భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిల రెండో కూతురు మౌనిక రెడ్డిని ఇప్పుడు వివాహమాడారు.
మౌనికరెడ్డి గతంలో బెంగళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ గణేష్ రెడ్డితో పెళ్లి జరిగింది. వీరి వివాహానికి పలువురు రాజకీయ ప్రముఖులు, టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఆ తర్వాత కొన్ని తెలియని కారణాల వలన మౌనిక తన భర్తకు రెండేళ్ల క్రితం విడాలు ఇచ్చింది. ఇక భూమా మౌనికరెడ్డికి, మంచు మనోజ్ ఇద్దరికి ఇది రెండో పెళ్లి కావడం విశేషం. పర్సనల్ రీజన్స్ తో ఇద్దరు తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టిన వీళ్లిద్దరూ మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
ఇదిలా ఉంటే మార్చి 3న అంటే శుక్రవారం రాత్రి 8:30 నిమిషాలకు ఈ పెళ్లి సంబరాలు ఘనంగా జరిగాయంటూ మంచు మనోజ్ సోషల్ మీడియాతో షేర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మనోజ్ తన సిస్టర్ కోసం కాస్త ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. ‘‘అక్కా ఏ జన్మ పుణ్యమో నాది, లవ్ యూ అక్కా, నువ్వే నా కోసం ఇంత చేస్తున్నావు.. థ్యాంక్యూ’’ అంటూ ఎమోషనల్ అయ్యాడు మనోజ్.