మరికొన్ని గంటల్లో ఆదిపురుష్(adhipurush) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. గంటలు త్వరగా గడిచిపోతే బాగుండని ప్రభాస్(Prabhas) అభిమానులు కోరుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు 16వ తేదీ వస్తుందా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీన విడుదల కాబోతున్న ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరామచంద్రుడిగా నటిస్తుంటే, సీతమ్మ పాత్రను కృతి సనన్(kriti sanon) పోషిస్తున్నారు.
మరికొన్ని గంటల్లో ఆదిపురుష్(adhipurush) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. గంటలు త్వరగా గడిచిపోతే బాగుండని ప్రభాస్(Prabhas) అభిమానులు కోరుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు 16వ తేదీ వస్తుందా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీన విడుదల కాబోతున్న ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరామచంద్రుడిగా నటిస్తుంటే, సీతమ్మ పాత్రను కృతి సనన్(kriti sanon) పోషిస్తున్నారు. ఇక లంకాధీశుడిగా సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ పనులతో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. తిరుపతిలో(Tirupathi) జరిగిన ప్రీ రిలీజ్ వేడుక తర్వాత సినిమాపై చాలామందికి ఆసక్తి పెరిగింది. పైగా ఆదిపురుష్ సినిమాను ప్రదర్శించే థియేటర్లలో ఒక సీటు ఖాళీగా ఉంచాలని మేకర్స్ నిర్ణయించారు. ఆ కుర్చీ ఆంజనేయ స్వామి కోసం.. అలాగే కొన్ని ప్రదేశాలలో రామాలయ మందిరానికి ఉచితంగా కొన్ని టికెట్లను ఇస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని నిరు పేతలకు, అనాథలకు ఉచితంగా చూపించాలని చాలా మంది ప్రముఖులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆ సినిమా టికెట్లను కొనుగోలు చేసి ప్రత్యేక షోలు వేయడానికి రెడీ అవుతున్నారు.
ఇప్పటికే ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్(Ranbir Kapoor), రామ్‌చరణ్(Ram charan), కార్తికేయ-2 నిర్మాత అభిషేక్ అగర్వాల్(Abhishek Aggarwal), గాయని అనన్య బిర్లా(ananya Birla) పది వేల టికెట్లను కొనడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు తాజాగా మంచు మనోజర్(Manchu Manoj), భూమా మౌనిక(Bhuma Mounika) జంట కూడా తెలుగు రాష్ట్రాలలోని వివిధ అనాథ శరణాలయాలకు చెందిన 25 వందల మంది పిల్లలకు ఆదిపురుష్ సినిమాను చూపించాలని నిర్ణయించుకున్నారు. ఎలాంటి హద్దులు లేకుండా అందరూ వేడుకలా జరుపుకోవాల్సిన సినిమా ఆదిపురుష్ అని, దీనిని తమ జీవితకాలంలో వచ్చిన అవకాశంగా భావించాలని మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు అంటున్నారు. ఆదిపురుష్ ద్వారా ఇతిహాస మహాగాధ రామాయణం(Ramayanam) గురించి తెలుసుకునేలా తెలుగు రాష్ట్రాల్లోని పలు అనాథ శరణాలయాల్లో(Orphanages) ఉన్న 2500 పిల్లలకు చూపించాలని నిర్ణయించుకున్నామన్నారు. జైశ్రీరామ్ అనే పవిత్ర శ్లోకం అన్ని చోట్ల ప్రతిధ్వనించాలి అని మంచు మనోజ్, భూమా మౌనిక తెలిపారు.