మంచు లక్ష్మీప్రసన్న(Lakshmi Manchu) గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. నటిగా, నిర్మాతగా ఆమె పరిచితురాలే! సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటే మంచు లక్ష్మీ తరచూ ట్రోల్ కూడా అవుతుంటారు. అనగనగా ఓ ధీరుడు సినిమాతో నటిగా పరిచయమైన మంచు లక్ష్మి మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నారు.

Lakshmi Manchu
మంచు లక్ష్మీప్రసన్న(Lakshmi Manchu) గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. నటిగా, నిర్మాతగా ఆమె పరిచితురాలే! సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటే మంచు లక్ష్మీ తరచూ ట్రోల్ కూడా అవుతుంటారు. అనగనగా ఓ ధీరుడు సినిమాతో నటిగా పరిచయమైన మంచు లక్ష్మి మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడమే పెద్ద సాహసమని చెప్పాలి. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించారు. కొన్నింటిలో చక్కటి ప్రతిభను కనబర్చారు. నిర్మాతగా పలు సినిమాలను కూడా రూపొందించారు. లాస్టియర్ మాన్‌స్టర్ అనే మలయాళ సినిమాలో కూడా నటించారు. అందులో మోహన్‌లాల్ హీరో! తెలుగు విషయానికి వస్తే ఆమె చివరకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన అంథాలజీ పిట్టకథలు చిత్రంలో నటించారు. తెలుగులో చేస్తున్న సినిమాలు ఎందుకోగానీ లక్ష్మీ ప్రసన్నకు బ్రేక్ ఇవ్వలేకపోయాయి. దీంతో లక్ష్మీ ప్రసన్న తన ఫోకస్‌ను బాలీవుడ్(Bollywood)వైపుకు మళ్లించారు. ఈ నేపథ్యంలో ఆమె తన మకాంను ముంబాయి(Mumbai)కి మార్చేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది. టాక్ కాదు,సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ చూస్తే అది నిజమే! కొత్త సిటీ, కొత్త శకం, కొత్త జీవితం పట్ల చాలా సంతోషంగా ఉన్నా. నన్ను ఎప్పుడూ సపోర్టు చేస్తూ నాపై నమ్మకం ఉంచిన నా అభిమానులకు ధన్యవాదాలు అని క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు ముంబాయిలోనే తన బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు.. వీడియోలు కూడా పోస్ట్ చేశారు మంచు లక్ష్మి. బర్త్ డే ఈవెంట్‌కు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఇక మంచు లక్ష్మీ ప్రసన్న హిందీ ప్రాజెక్టులపైనే ఫుల్ ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారట! ఆల్ ది బెస్ట్!
