ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ఫ్యామిలీలో మంచు ఫ్యామిలీ కూడా ఒకటి. అంతే కాదు ఎక్కువ ట్రోల్స్ ఫేస్ చేసే సినిమా ఫ్యామిలీ కూడా మంచు ఫ్యామిలీనే(Manchu Family). వారు ఏది మాట్లాడినా.. అది వైరల్ అవుతుంది. అందులో ఏదో ఒక కామెడీ వెతికి ..వాటిని మీమ్స్(Memes) గా చేసి సోషల్ మీడియాలో(Social media) వదిలేస్తుంటారు నెటిజన్లు.

హాలీవుడ్(Hollywood) లో ఉండి ఉంటే.. అక్కడ తాను పెద్ద స్టార్ ను అయ్యి ఉండేదాన్ని అంటోంది టాలీవుడ్ యాక్ట్రస్ మంచు లక్ష్మీ. తాను మళ్లీ హాలీవుడ్ కే వెళ్ళిపోతానంటోంది.

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ఫ్యామిలీలో మంచు ఫ్యామిలీ కూడా ఒకటి. అంతే కాదు ఎక్కువ ట్రోల్స్ ఫేస్ చేసే సినిమా ఫ్యామిలీ కూడా మంచు ఫ్యామిలీనే(Manchu Family). వారు ఏది మాట్లాడినా.. అది వైరల్ అవుతుంది. అందులో ఏదో ఒక కామెడీ వెతికి ..వాటిని మీమ్స్(Memes) గా చేసి సోషల్ మీడియాలో(Social media) వదిలేస్తుంటారు నెటిజన్లు. దాంతో మంచు లక్ష్మీ కాని.. మోహన్ బాబు(Mohan babu) కాని.. విష్ణు(Vishnu) కాని.. ఏం మాట్లాడుతారా..? ఏం స్టఫ్ దొరుకుతుందా అని ఎదరు చూస్తుంటారు నెటిజన్లు.

తాజగా మంచు లక్ష్మీ మళ్ళీ హాలీవుడ్ రాగం అందుకున్నారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో మన టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలేదన్నారు. నిహారికా, స్వాతి, బిందుమాధవి, ఈషా రెబ్బా లాంటి తెలుగు హీరోయిన్లకు టాలెంట్ ఉన్నా ఎందుకు తీసకోవడం లేదు.. అని ప్రశ్నించారు. అంతే కాదు హాలీవుడ్ లో ఉండగా మంచి నటిగా గుర్తింపు పొందిన తాను.. తెలుగు తెరపై మెరిసి.. తన కుటుంబంతో కలిసి ఉండాలనే ఇక్కడికి వచ్చానన్నారు. అక్కడే ఉండి ఉంటే.. చాలా పెద్ద స్టార్ ను అయ్యేదాన్ని అని అంటున్నారు మంచు లక్ష్మీ. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు పంచుకున్నారు మంచు లక్ష్మీ.

క్కడ ప్రేక్షకులు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన హీరోయిన్స్ అంటేనే ఇష్టపడతారు. అక్కడ హీరోయిన్స్ కి ఇచ్చే ప్రియార్టీ తెలుగు హీరోయిన్స్ కి ఒక్కశాతం ఇచ్చినా వాళ్ల స్థాయి ఎక్కడో ఉండేది. ఇక్కడే పుట్టి పెరిగిన నిహారిక కు నటనా పరంగా ఏం తక్కువ? తెలుగు హీరోయిన్స్ బింధు మాధవి, శివాని, శివాత్మిక, మాధవి, మధుషాలిని ఇలా ఎంతోమంది అందం, టాలెంట్ ఉన్నా.. అవకాశాలు రావడం లేదు. నేను ఎవరినీ తప్పు పట్టడం లేదు.. ప్రేక్షకుల ఆలోచనా విధానం మారాలి అన్నారు.

అంతే కాదు తాను ఇండియాకు వచ్చి చాలా ఏళ్లు అవుతుందని... మళ్ళీ అవకాశం వస్తే.. హాలీవుడ్ కు వెళ్లిపోతానంటోంది మంచు లక్ష్మీ. ప్రస్తుతం మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated On 8 July 2023 12:34 AM GMT
Ehatv

Ehatv

Next Story