సీనియర్‌ నటుడు మోహన్‌బాబు(Mohan babu) వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సినీరంగ ప్రవేశం చేసిన మంచు లక్ష్మికి(Manchu lakshmi) పెద్దగా పేరు ప్రఖ్యాతులు రాలేదు. ఆమె నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీసును బద్దలు కొట్టలేదు. ఏదో వచ్చిన అవకాశాలను వదులుకోకుండా సినిమాలు చేస్తూ వెళ్లింది. తెలుగువారికి టాలెంట్‌ను గుర్తించడం రాదు.. లేకపోతే మంచులక్ష్మీ ఎక్కడో ఉండేది! ఇది మంచు లక్ష్మి స్వగతం మాత్రమే సుమా! తెలుగు సినీ పరిశ్రమపై ఆమె ఈ రకమైన నిందలే వేశారు. ఆమె ఏమన్నారంటే ' నేను హాలీవుడ్‌(Hollywood) యాక్టర్‌ను. అక్కడ చాలా సినిమాల్లో నటించాను.

సీనియర్‌ నటుడు మోహన్‌బాబు(Mohan babu) వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సినీరంగ ప్రవేశం చేసిన మంచు లక్ష్మికి(Manchu lakshmi) పెద్దగా పేరు ప్రఖ్యాతులు రాలేదు. ఆమె నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీసును బద్దలు కొట్టలేదు. ఏదో వచ్చిన అవకాశాలను వదులుకోకుండా సినిమాలు చేస్తూ వెళ్లింది. తెలుగువారికి టాలెంట్‌ను గుర్తించడం రాదు.. లేకపోతే మంచులక్ష్మీ ఎక్కడో ఉండేది! ఇది మంచు లక్ష్మి స్వగతం మాత్రమే సుమా! తెలుగు సినీ పరిశ్రమపై ఆమె ఈ రకమైన నిందలే వేశారు. ఆమె ఏమన్నారంటే ' నేను హాలీవుడ్‌(Hollywood) యాక్టర్‌ను. అక్కడ చాలా సినిమాల్లో నటించాను. అక్కడే ఉండి ఉంటే కచ్చితంగా నేను టాప్‌స్టార్‌ అయ్యేదాన్ని. పెళ్లి తర్వాత పిల్లలు కావాలన్న ఉద్దేశంతో ఇండియాకు వచ్చేశాను. కుటుంబానికే పరిమితమయ్యాను. ఇప్పుడు నా పాపకు తొమ్మిదేళ్లు. ఇప్పుడు నేను స్వతంత్రురాలిని! ఎక్కడికైనా ఎగిరిపోగలను. లక్కు కలిసివచ్చి హాలీవుడ్‌లో ఛాన్సులు వస్తే వెంటనే అమెరికాకు వెళ్లిపోతాను. ఇక్కడ ఎంత చేసిన గుర్తింపు ఉండదన్నది అర్థమయ్యింది. మన తెలుగు దర్శక,నిర్మాతలకు ఎంతసేపూ పక్క రాష్ట్రాల అమ్మాయిలు కావాలి. ప్రేక్షకులు కూడా అంతే! ఎక్కడి నుంచో వచ్చిన వారిని మాత్రం అభిమానిస్తారు. మన ఇంట్లో, మన ఊళ్లో ఉండే అమ్మాయిని ఒక్క శాతం ప్రోత్సహించినా టాప్‌ టెన్‌లో ఉండేవారు. మనకంతా వేరే రాష్ట్రాల అమ్మాయిలే కావాలి. నేనే ఒక ప్రొడక్షన్‌ హౌస్‌ను స్టార్ట్ చేసి తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇద్దామని ఉన్నా.. నన్నే ఎవరూ చూడటం లేదు. ఇక వారందరిని పెట్టుకుని చేతులు కాల్చుకోవడం ఎందుకు? ప్రేక్షకుల మైండ్‌సెట్‌ మారితే తప్ప మా లాంటి వారికి అవకాశాలు రావు' అంటూ మంచు లక్ష్మి ఆవేదనతో చెప్పుకొచ్చారు. మంచు లక్ష్మి చెప్పినదాంట్లో నిజముంది కదా!

Updated On 20 Jan 2024 2:11 AM GMT
Ehatv

Ehatv

Next Story