మనం చాలా సార్లు వింటూనే ఉంటాం.. చాలా ఏళ్ల తర్వాత ఏ పెళ్లికో.. ఫంక్షన్‏కో.. ఇంకేదైనా కార్యక్రమానికి అటెండ్ అయితే.. నువ్వు అస్సలు మారలేదు, అచ్చం అప్పట్లానే ఉన్నావు అంటుంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. మనందరికీ తెలుసు మలయాళ సూపర్ మోహన్‏లాల్ (Mohanlal), మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ఈ స్టార్స్ ఇద్దరూ మంచి స్నేహితులని. వీళ్లరిద్దరినీ బిగ్ ఎమ్ఎస్ ఆఫ్ మలయాళం ఇండస్ట్రీ అని పిలుస్తారు.

మనం చాలా సార్లు వింటూనే ఉంటాం.. చాలా ఏళ్ల తర్వాత ఏ పెళ్లికో.. ఫంక్షన్‏కో.. ఇంకేదైనా కార్యక్రమానికి అటెండ్ అయితే.. నువ్వు అస్సలు మారలేదు, అచ్చం అప్పట్లానే ఉన్నావు అంటుంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. మనందరికీ తెలుసు మలయాళ సూపర్ మోహన్‏లాల్ (Mohanlal), మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ఈ స్టార్స్ ఇద్దరూ మంచి స్నేహితులని. వీళ్లరిద్దరినీ బిగ్ ఎమ్ఎస్ ఆఫ్ మలయాళం ఇండస్ట్రీ అని పిలుస్తారు. వీళ్లను స్క్రీన్‏పై చూడటాన్ని అభిమానులు ఎంతో ఇష్టంగా భావిస్తారు. ఇదిలా ఉంటే తాజాగా మమ్ముట్టి, మోహన్‏లాల్ పెళ్లి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది.

మమ్ముట్టి, మోహన్ లాల్‏లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. మోహన్‏లాల్, మమ్ముట్టి దంపతులు సుచిత్ర (Suchitra), సుల్ఫాకుట్టి (Sulfah Kutty) కలిసి దిగిన ఓ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ ఫొటోలో మోహన్ లాల్, మమ్ముట్టి తమ భాగస్వాములతో కలిసి ఉన్న నాటి, నేటి ఫొటోలను కలిసి చూపిస్తున్నారు. ఈ ఫొటోల్లో వాళ్లు అప్పుడు, ఇప్పుడు అంటే.. 35 ఏళ్ల క్రితం ఉన్న ఫొటో రెండింటినీ కంపేర్ చేసి ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. అయితే దుబాయ్‏లో జరిగిన ఓ వెంట్‏లో ఈ రెండు కుటుంబాలు ఫొటో దిగాయి. ఇప్పుడు ఆ పిక్స్ ఫ్యాన్స్‏ను తెగ ఆకట్టుకుంటుంది.

వైరల్ అవుతున్న ఫొటోలో.. వాళ్లు స్టైలిష్ కాస్ట్యూమ్స్ వేసుకుని.. ఇద్దరు లెజెండ్స్ చరిష్మా కనిపిస్తోంది. మరికొంతమంది అయితే వీళ్లిద్దరినీ బాలీవుడ్ పిల్లర్స్ అంటూ కమెంట్ చేస్తున్నారు. ఇక వీళ్లిద్దరి సినిమాల విషయానికి వస్తే.. కాథల్-ది కోర్ (Kaathal-The Core) అనే ఫ్యామిలీ డ్రామాలో మెగాస్టార్ మమ్ముట్టి, పాపులర్ నటి జ్యోతిక కలిసి నటించారు. ఇక మోహన్ లాల్ మలైకొట్టాయ్ వాలియన్ (Malaikottai Vaaliban) అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిసేరి దర్శకత్వం వహిస్తున్నారు. రజినీకాంత్ నటిస్తున్న జైలర్ చిత్రంలోనూ మోహన్ లాల్ కీలక పాత్ర చేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ ‏లో వస్తున్న ఎల్2 చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లూసీఫర్‏కు సీక్వెల్‏గా ఎల్2: ఎంపురాన్ (L2:Empuraan) పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Updated On 7 Jun 2023 12:07 AM GMT
Ehatv

Ehatv

Next Story