సినిమాల వల్ల జరిగే ప్రయోజనాలేమిటో పొలిటికల్‌ పార్టీలకు, ఆ పార్టీలను ఆరాధించే దర్శక, నిర్మాతలకు తెలిసొచ్చింది. ప్రజలలో ఓ రకమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా తమ పబ్బం గడుపుకోవాలన్న తలంపుతోనే కొందరు కొన్ని సినిమాలు తీస్తున్నారు. మొన్న వచ్చిన కశ్మీర్‌ ఫైల్స్‌ కానీ, నిన్న వచ్చిన ది కేరళ స్టోరీ కానీ ఇవే బాపతు సినిమాలు. కేరళ స్టోరీ ఎంతటి వివాదాన్ని సృష్టించిందో చూశాం!

సినిమాల వల్ల జరిగే ప్రయోజనాలేమిటో పొలిటికల్‌ పార్టీలకు, ఆ పార్టీలను ఆరాధించే దర్శక, నిర్మాతలకు తెలిసొచ్చింది. ప్రజలలో ఓ రకమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా తమ పబ్బం గడుపుకోవాలన్న తలంపుతోనే కొందరు కొన్ని సినిమాలు తీస్తున్నారు. మొన్న వచ్చిన కశ్మీర్‌ ఫైల్స్‌ కానీ, నిన్న వచ్చిన ది కేరళ స్టోరీ కానీ ఇవే బాపతు సినిమాలు. కేరళ స్టోరీ ఎంతటి వివాదాన్ని సృష్టించిందో చూశాం! ఆఖరికి ఎన్నికల ప్రచారానికి కూడా సినిమాను వాడుకున్నాయి పార్టీలు. ఈ వివాదం సద్దుమణిగిందనుకునే లోపు ఇప్పుడు మరో సినిమాపై గొడవ మొదలయ్యింది. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని ది డైరీ ఆఫ్‌ వెస్ట్‌ బెంగాల్‌ సినిమా తీశారు. దీని ట్రైలర్‌ విడుదలయ్యింది.

ఇది బెంగాల్ ప్రభుత్వానికి కోపం తెప్పించింది. ఆ చిత్రంతో రాష్ట్రం పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులు దర్శకుడు సనోజ్ మిశ్రా(Sanoj Mishra) నోటీసులు జారీ చేశారు. పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సహజంగానే ఈ పరిణామాలు రుచించని బీజేపీ రంగంలోకి దిగింది. రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా తీస్తే మమతాబెనర్జీ(Mamatha Benerjee) ప్రభుత్వానికి ఎందుకంత ఉలికిపాటు? అని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఇంతకు ముందు ‘ది కేరళ స్టోరీ’ని నిషేధించాలని ప్రయత్నించిన మమతా బెనర్జీ సర్కారు ఇప్పుడు ది డైరీ ఆఫ్‌ వెస్ట్ బెంగాల్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించింది.

భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని తెలిపింది. మమతా బెనర్జీ విలువలు లేని ప్రభుత్వాన్ని నడుపుతున్నారనీ, టీఎంసీ ప్రభుత్వానికి ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని బీజేపీ నేత అమిత్‌ మాలవీయ అన్నారు. బెంగాల్ రాష్ట్రం పరువు తీయడం తమ ఉద్దేశం కాదని దర్శకుడు సనోజ్‌ మిశ్రా అంటున్నారు. ఇందుకోసం ఎంతో రీసెర్చ్‌ చేశామని, సినిమాలో నిజాలనే చూపించామని అన్నారు. సినిమా షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదని, వచ్చే నెల సెన్సార్‌కు పంపించే అవకాశం ఉందని సనోజ్‌ మిశ్రా తెలిపారు. ఈ సినిమాకు కథను అందించిన జితేంద్ర నారాయణ్‌సింగ్‌ త్యాగినే నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. జితేంద్ర నారాయణ్‌సింగ్‌ త్యాగి అసలు పేరు వసీం రిజ్వి. ఉత్తరప్రదేశ్‌లోని షియా వక్ఫ్‌ బోర్డుకు ఛైర్మన్‌ పని చేసిన వసం రిజ్వీ 2021 డిసెంబర్‌లో హిందూమతం పుచ్చుకున్నారు. తన పేరును జితేంద్రగా మార్చుకున్నారు.

Updated On 27 May 2023 2:01 AM GMT
Ehatv

Ehatv

Next Story