మల్లిక జాగుల(Mallika Jagula) కొన్ని సినిమాల్లో చేసినప్పటికీ అవన్నీ చిన్న చిన్న పాత్రలు, వ్యాంప్‌ క్యారెక్టర్లు కావడంతో రావాల్సినంత గుర్తింపు రాలేదు. సినిమాలను నమ్ముకుంటే లాభం లేదని టెలివిజన్‌ రంగంలోకి అడుగుపెట్టారు. సీరియల్స్‌తో(Serials) గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో పాటు డబ్బును సంపాదించారు. ఒకప్పుడు చేతినిండా సీరియల్స్‌తో చాలా బీజీగా ఉండేవారు. కారణమేమిటో కానీ అకస్మాత్తుగా స్మాల్ స్క్రీన్‌కు దూరమయ్యారు. ఇటీవలే మళ్లీ సీరియల్స్‌లో కనిపిస్తున్నారు.

మల్లిక జాగుల(Mallika Jagula) కొన్ని సినిమాల్లో చేసినప్పటికీ అవన్నీ చిన్న చిన్న పాత్రలు, వ్యాంప్‌ క్యారెక్టర్లు కావడంతో రావాల్సినంత గుర్తింపు రాలేదు. సినిమాలను నమ్ముకుంటే లాభం లేదని టెలివిజన్‌ రంగంలోకి అడుగుపెట్టారు. సీరియల్స్‌తో(Serials) గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో పాటు డబ్బును సంపాదించారు. ఒకప్పుడు చేతినిండా సీరియల్స్‌తో చాలా బీజీగా ఉండేవారు. కారణమేమిటో కానీ అకస్మాత్తుగా స్మాల్ స్క్రీన్‌కు దూరమయ్యారు. ఇటీవలే మళ్లీ సీరియల్స్‌లో కనిపిస్తున్నారు. లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను, బాధలను చెప్పుకుని కంటతడి పెట్టారు. ఇక్కడి ఇండస్ట్రీలో తెలుగువారికి అవకాశాలు అంతగా ఇవ్వరని, కన్నడ తారలను ఎక్కువ రెమ్యూనరేషన్‌ ఇచ్చి మరీ తీసుకుంటారని, మమ్మల్ని మాత్రం చిన్నచూపు చూస్తారని మల్లిక చెప్పారు. అవకాశాలు రాకపోయేసరికి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని, తిండి కూడా సరిగ్గా తినకపోవడంతో నిల్చున్న చోటే పడిపోయేదాన్నని చెబుతూ ఆ కండిషన్‌లో తనను ఆసుపత్రికి తీసుకెళితే బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారంటూ ఎమోషనల్‌ అయ్యారు. నిజంగా తనకు ఇది పునర్జన్మనేనని తెలిపారు. 'కరోనా కాలంలో అవకాశాలు అసలు రాలేదు. 19 ఏళ్ల అనుభవం ఎందుకూ పనికిరాలేదు. ఎక్కడి నుంచి మొదలు పెట్టానో మళ్లీ అక్కడికే వచ్చాను. ఇదే ఆలోచించి పిచ్చిదాన్ని అయ్యాను. మొన్నటి వరకు బతకడం కోసం చీరలు అమ్మాను. పెట్రోల్‌ బంకులో(Petrol bunk) పని చేయడానికి కూడా రెడీ అయ్యాను. అక్కడ కూడా వారు చులనకగా మాట్లాడారు. పదేళ్ల కిందట నా పారితోషికం రోజుకు 13 వందల రూపాయలు. అందులో మళ్లీ కటింగ్స్‌ ఉంటాయి. నాలుగేళ్లు అదే రెమ్యునరేషన్‌కు(Remuneration) పని చేశాను. ఇండస్ట్రీలో ఉన్నవారు డబ్బులు ఆదా చేస్తారనుకుంటారు కానీ అందరి పరిస్థితి అలా ఉండదు' అని మల్లిక జాగుల చెప్పుకొచ్చారు. 'మొదట్లో సినిమా అవకాశాలు చాలానే వచ్చాయి. అలా ఓ ఆడిషన్‌కు వెళ్లినప్పుడు కమిట్‌మెంట్‌ అడిగారు. నేను తిరస్కరించి వచ్చేశాను. ఆ తర్వాత నెల రోజుల పాటు నన్ను భయంకరంగా టార్చర్‌ పెట్టారు. ఆ కసితోనే సీరియల్స్‌ ద్వారా నేనేమిటో చూపించాను. డబ్బుల కోసం కొన్ని సినిమాలలో వాంప్‌ క్యారెక్టర్లు పోషించాల్సి వచ్చింది. నేను ఒళ్లు చూపించానే తప్ప ఎప్పుడూ ఒళ్లు అమ్ముకోలేదు. నేను అమితంగా ప్రేమించిన వ్యక్తి చనిపోయాడు. అతడిని మర్చిపోవడానికి మద్యం తాగేదాన్ని. అది అలవాటుగా మారింది. ఇప్పటికీ రాత్రి ఒక పెగ్గేస్తే కానీ నిద్రపట్టదు. ఇక నా జీవితంలో మరెవ్వరికీ చోటు లేదు. నేను పెళ్లే చేసుకోను' అని మల్లిక జాగుల తెలిపారు.

Updated On 2 April 2024 2:12 AM GMT
Ehatv

Ehatv

Next Story