తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యధిక ప్రజాదరణ పొందిన షో ఏదైనా ఉంది అంటే అది 'జబర్దస్త్'.. ఈ షోకి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు.. కేవలం జబర్దస్త్ వల్ల ఈటీవీ చాలా కాలం టాప్ రేటింగ్స్‏తో దూసుకుపోయింది.. ఎంతో మంది జబరదస్త్ కమెడియన్లు ఇప్పుడు సినిమాల్లో పెద్ద స్టార్లుగా ఉన్నారు.. సుడిగాలి సుదీర్, గెట్అప్ శ్రీను, హైపర్ ఆది ఇలా చాలా మంది వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు. అయితే ప్రస్తుత్తం జబర్దస్త్ అనుకున్న స్థాయిలో ఆదరణ పొందడంలో వెనుకబడించి.

తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యధిక ప్రజాదరణ పొందిన షో ఏదైనా ఉంది అంటే అది 'జబర్దస్త్' (Jabardasth).. ఈ షోకి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు.. కేవలం జబర్దస్త్ వల్ల ఈటీవీ (ETV) చాలా కాలం టాప్ రేటింగ్స్‏తో దూసుకుపోయింది.. ఎంతో మంది జబరదస్త్ కమెడియన్లు ఇప్పుడు సినిమాల్లో పెద్ద స్టార్లుగా ఉన్నారు.. సుడిగాలి సుదీర్ (Sudigali Sudheer) , గెట్అప్ శ్రీను (Getup Srinu) , హైపర్ ఆది (Hyper Aadi) ఇలా చాలా మంది వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు. అయితే ప్రస్తుత్తం జబర్దస్త్ అనుకున్న స్థాయిలో ఆదరణ పొందడంలో వెనుకబడించి.. దానికి ఎన్నో కారణాలు చెబుతున్నా.. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టీమ్ లీడర్స్. జబర్దస్త్ ప్రారంభంలో వేణు,ధనరాజ్, రఘు ఇలా పేరు పొందిన కమెడియన్లు టీమ్ లీడర్లుగా ఉండి షోని హిట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే తరువాత సినిమా అవకాశాలతో వారు షో నుంచి తప్పుకున్నారు.

జబర్దస్త్ రేటింగ్స్ పరంగా, వ్యూస్ పరంగా వెనుకబడింది. గత కొంత కాలంగా ఈ షోకి పెద్దగా ఆదరణ దొరకడంలేదు.. అందుకోసం మల్లెమాల టీమ్ కొత్త నిర్ణయం తీసుకుంది. షో హిట్ అవ్వడానికి ఎంతగానో కృషిచేసిన సీనియర్ కమెడియన్లను మళ్లీ రంగంలోకి దించాలని చూస్తుంది.. అందుకోసం చర్చలు కూడా జరుపుతున్నారట. ధనరాజ్ (Danaraj) ,వేణు (Balagam Venu), రఘు, సుడిగాలి సుధీర్ ఇలా ఎక్కువ పేరు సాధించిన వారిని మళ్లీ జబర్దస్త్ లోకి తీసుకురావాలని మల్లెమాల సమస్త ప్రయత్నిస్తోంది.. ఒకవేళ ఇదే జరిగితే మళ్లీ జబర్దస్త్‏కు పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంది.

Updated On 24 May 2023 4:50 AM GMT
Ehatv

Ehatv

Next Story