మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి ఫాతిమా ఇస్మాయిల్ ( Fathima Ismail) కన్నుమూశారు. 93 ఏళ్ల వయస్సున్న ఆమె కొచ్చి (Cocchi) లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి ఫాతిమా ఇస్మాయిల్ ( Fathima Ismail) కన్నుమూశారు. 93 ఏళ్ల వయస్సున్న ఆమె కొచ్చి (Cocchi) లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కొట్టాయం (Kottayam) లోని చెంపులో ఉన్న ఆమె స్వగ్రామంలో మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం. ఆమె మృతిచెందడంతో మలయాళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు.

ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత శశిథరూర్ (Shashi Tharoor) ట్విటర్ (Twitter) ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. ఈ ఉదయం మమ్ముట్టి (Mammootty)తో మాట్లాడిన శశిథరూర్.. ఫాతిమా ఇస్మాయిల్ మృతిపట్ల సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తల్లి ప్రేమను గుర్తు చేసుకున్నారు. ఇక ఫాతిమా ఇస్మాయిల్ ( Fathima Ismail) ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నానని శశిథరూర్ అన్నారు.

Updated On 21 April 2023 12:56 AM GMT
Ehatv

Ehatv

Next Story