సీనియర్‌ నటి ఆర్‌.సుబ్బలక్ష్మి(R.Suba Lakshmi) కన్నుమూశారు. 87 ఏళ్ల సుబ్బలక్ష్మి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొచ్చిలోని(Kochi) ఓ ప్రయివేటు హాస్పిటల్లో(Hospital) చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. భావోద్వేగానికి లోనైన ఆమె మనవరాలు సోషల్‌ మీడియాలో(Social Media) ఈ విషయాన్ని చెబుతూ ' నా బలం మా అమ్మమ్మ.. ఆమెను నేను కోల్పోయాను' అంటూ పోస్ట్‌ పెట్టారు.సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు సుబ్బలక్ష్మి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సీనియర్‌ నటి ఆర్‌.సుబ్బలక్ష్మి(R.Suba Lakshmi) కన్నుమూశారు. 87 ఏళ్ల సుబ్బలక్ష్మి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొచ్చిలోని(Kochi) ఓ ప్రయివేటు హాస్పిటల్లో(Hospital) చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. భావోద్వేగానికి లోనైన ఆమె మనవరాలు సోషల్‌ మీడియాలో(Social Media) ఈ విషయాన్ని చెబుతూ ' నా బలం మా అమ్మమ్మ.. ఆమెను నేను కోల్పోయాను' అంటూ పోస్ట్‌ పెట్టారు.సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు సుబ్బలక్ష్మి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మలయాళ(Malayalam) సినీ పరిశ్రమకు చెందన సుబ్బలక్ష్మి తమిళ, తెలుగు భాషల్లోనూ నటించారు. తెలుగులో వేణు నటించిన కల్యాణరాముడు, నాగచైతన్య నటించిన ఏ మాయ చేసావె సినిమాల్లో నటించారు. ఏ మాయ చేసావెలో సమంత(Samantha) అమ్మమ్మగా నటించారు. చివరిసారిగా విజయ్‌(Vijay) నటించిన బీస్ట్‌(Beast) సినిమాలో కనిపంచారు. పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించిన సుబ్బలక్ష్మి సినీ పరిశ్రమలో రాక ముందు జవహర్‌ బాలభవన్‌లో సంగీత, నాట్య శిక్షకురాలిగా పని చేశారు. 1951లో ఆల్‌ ఇండియా రేడియోలో(All India Radio) చేరారు. ఆల్‌ ఇండియాలో రేడియోలో పని చేసిన తొలి దక్షిణాది లేడి కంపోజర్‌ సుబ్బలక్ష్మినే! డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా ఈమెకు మంచి పేరు ఉంది.

Updated On 1 Dec 2023 1:31 AM GMT
Ehatv

Ehatv

Next Story