సినిమా కెరీర్ చరమాంకంలో ఉన్న సమయంలో చాలా మంది హీరోయిన్లు ఇక చాల్లే అనుకుంటూ పెళ్లి చేసుకుని శేష జీవితాన్ని హాయిగా గడిపేస్తారు. సినిమా అవకాశాలు వస్తే కాదనకుండా చేసేస్తారు. ఇప్పటికే చాలా మంది కథానాయికలు పెళ్లిళ్లు చేసుకున్నారు. రకుల్ ప్రీత్‌సింగ్, తాప్సీ పన్ను, మీరా చోప్రా, అక్ష వీరంతా వివాహజీవితంలో అడుగుపెట్టారు.

Aparna Das Marriage
సినిమా కెరీర్ చరమాంకంలో ఉన్న సమయంలో చాలా మంది హీరోయిన్లు ఇక చాల్లే అనుకుంటూ పెళ్లి చేసుకుని శేష జీవితాన్ని హాయిగా గడిపేస్తారు. సినిమా అవకాశాలు వస్తే కాదనకుండా చేసేస్తారు. ఇప్పటికే చాలా మంది కథానాయికలు పెళ్లిళ్లు చేసుకున్నారు. రకుల్ ప్రీత్‌సింగ్, తాప్సీ పన్ను, మీరా చోప్రా, అక్ష వీరంతా వివాహజీవితంలో అడుగుపెట్టారు. ఇక వరలక్ష్మి శరత్‌కుమార్, అదితి రావు హైదరి కూడా పెళ్లి పనుల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ చిట్టాలో మరో హీరోయిన్ చేరింది. మలయాళ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అపర్ణదాస్(Aparna Das), వైవాహిక బంధంలో అడుగుపెట్టబోతున్నది. ప్రస్తుతం ఈమె వివాహ వేడుకలు మొదలయ్యాయి. నిన్న హల్దీ వేడుక జరిగింది. రేపు అంటే బుధవారం ఆమె పెళ్లి జరగనుంది. మంజుమ్మల్ బాయ్స్(Manjumal Boys) ఫేమ్ దీపక్ పరంబోరల్‌తో(Deepak Paramboral) ఆమె ఏడడుగులు నడవబోతున్నది. గత కొన్నాళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు. అపర్ణ వయసు 28 ఏళ్లు మాత్రమే. ఈ వయసులో పెళ్లి చేసుకున్నవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఫహిద్ ఫాజిల్ నటించిన నాన్ ప్రకాశన్‌తో అపర్ణ దాస్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మనోహరం చిత్రంలో దీపక్, అపర్ణ దాస్ కలిసి నటించారు. ప్రియన్ ఒటమిన్, సిక్రెట్ హోమ్ వంటి సినిమాలతో అపర్ణ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత విజయ్ నటించిన సినిమాతో తమిళంలో కూడా అడుగుపెట్టింది. తర్వాత దాదా అనే చిత్రంలో కూడా నటించింది. ఆదికేశవ అనే తెలుగు సినిమాలో కూడా నటించింది అపర్ణ.
