మలయాళ నటి విన్సి అలోషియస్ ఇటీవల ఓ కార్యక్రమంలో తనపై ఓ అగ్ర హీరో డ్రగ్స్ మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడని సంచలన ఆరోపణలు చేశారు.

మలయాళ నటి విన్సి అలోషియస్ ఇటీవల ఓ కార్యక్రమంలో తనపై ఓ అగ్ర హీరో డ్రగ్స్ మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడని సంచలన ఆరోపణలు చేశారు. మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ప్రచారంలో పాల్గొన్న ఆమె, ఒక సినిమా షూటింగ్ సమయంలో ఈ చేదు అనుభవం ఎదురైందని వెల్లడించింది. ఆ సినిమా కోసం తాను అది భరించినట్లు తెలిపారు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, కానీ హీరో ఎవరనే విషయంపై విన్సి స్పష్టత ఇవ్వలేదు.
మలయాళ నటి విన్సీ అలోషియస్ (Vincy Aloshious)గతంలో డ్రగ్స్ వాడే నటులతో తాను పని చేయనని చెప్పింది. . కానీ ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది, తన సహ నటులలో ఒకరు సెట్‌లో డ్రగ్స్ సేవించి తనతో "అనుచితంగా ప్రవర్తించారని విన్సీ అలోషియస్ ఆరోపించారు. "ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నారని నాకు తెలిస్తే, నేను వారితో ఏ సినిమాలో నటించను." అని ఆమె గతంలో ప్రకటన చేసింది.
"కొన్ని రోజుల క్రితం, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కార్యక్రమంలో భాగంగా నాకు తెలిసిన మాదకద్రవ్యాలు వాడే వ్యక్తులతో నేను మళ్లీ సినిమాలు చేయనని ఒక ప్రకటన చేశాను. "నేను ప్రధాన నటులలో ఒకరు డ్రగ్స్ వాడిన, అనుచితంగా ప్రవర్తించిన ఒక చిత్రంలో పని చేస్తున్నాను. అతనితో పనిచేయడం అంత సులభం కాదు. నా డ్రెస్సింగ్‌లో సమస్య వచ్చినప్పుడు దానిని సరిచేసుకునేందుకు వెళ్తుండగా, ఆల్ అఫ్ సడెన్‌గా వచ్చి అతను నాతో రావాలని పట్టుబట్టి, నా డ్రెస్‌ను నేను సరిచేస్తాను' అని చెప్పాడు. సినిమా గురించి అతని ప్రవర్తనను చూసి చూడనట్లు వదిలేశానని ఆమె చెప్పుకొచ్చారు.
