నటి రేవతి సంపత్‌ సంచలన ఆరోపణ

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పక్కలో పడుకుంటే కానీ ఛాన్సులు ఇవ్వడం లేదని, కాస్టింగ్‌ కౌచ్‌(Casting couch) భయంకరంగా ఉందని జస్టిస్‌ హేమ కమిటీ(Hema Justice Committe) ఇచ్చిన నివేదికలో తేట తెల్లమయ్యింది. అడుగడుగునా వివక్షకు గురి అవుతున్నారని కమిటీ నివేదిక తెలిపింది. ఈ క్రమంలోనే మలయాళ ని రేవతి సంపత్(Revathi sampath) తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బహిరంగ పరిచింది. మ‌ల‌యాళ సీనియ‌ర్ న‌టుడు సిద్ధిఖీ(Siddique) తనపై లైంగిక దాడి(Sexual harrasment) చేశాడంటూ నటి రేవతి సంపత్‌ సంచలన ఆరోపణ చేసింది. ఆమె వ్యాఖ్యలతో మాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగుతోంది. అసోషియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్‌ (AMMA)కు జనరల్ సెక్రటరీగా ఉన్న సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేశాడు. తన రాజీనామా పత్రాన్ని అమ్మ ప్రెసిడెంట్‌ మోహన్‌లాల్‌కు ఇచ్చారు. 2011లో తనను చెప్పుకోలేని రీతిలో హింసించారని రేవతి సంపత్‌ తెలిపింది. తనపై లెంగిక దాడికి ప్రయత్నించిన వారి పేర్లను కూడా బయటపెట్టింది. ఆమె చెప్పిన 14 మంది పేర్లలో నటుడు సిద్దిఖీ కూడా ఉన్నాడు. నటి రేవతి సంపత్‌ ఏమి చెప్పిదంటే ' నాకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండేది. అవకాశాల కోసం ఎదురుచూస్తుండేదాన్ని. ఆ సమయంలోనే సోషల్‌ మీడియా ద్వారా సిద్ధిఖీ పరిచయం అయ్యాడు. ఆయన నటిస్తున్న సినిమాలో ఛాన్సు ఇస్తానని నాకు ఆశ చూపించాడు. ఏడేళ్ల కిందట వచ్చిన సుఖమయిరిక్కట్టే సినిమాలో సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించాడు. ఆ సినిమా ప్రీమియ‌ర్ షోకు న‌న్ను కూడా ఆహ్వానించాడు. సినిమా పూర్తి అయిన తర్వాత తిరువ‌నంత‌పురంలోని మ‌స్క‌ట్ హోట‌ల్‌కు నన్ను తీసుకెళ్లాడు. అక్కడ నాపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ఎదురుతిరిగిన నాపై దాడికి దిగాడు. నరకం చూపించాడు. ఆ భయానక సంఘటన నుంచి నేను ఇప్పటికీ కోలుకోలేకున్నాను' అని తెలిపింది. సిద్ధిఖీ చాలా నీచమైన వ్యక్తి అంటూ తన స్నేహితులపై కూడా ఆయన లైంగిక దాడికి పాల్పడ్డాడని రేవతి సంపత్‌ చెప్పింది.

జస్టిస్‌ హేమ కమిషన్‌ నివేదిక బయటకు వచ్చిన తర్వాత మ‌ల‌యాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అందులో జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఉన్న సిద్ధిఖీ అందరికీ న్యాయం చేస్తానని వ్యాఖ్యానించడం గమనార్హం. సిద్ధిఖీ ఆ కామెంట్ చేసిన కొన్ని గంటల్లోనే రేవతి సంపత్‌ ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. దీంతో సిద్ధిఖీ తన పదవికి రాజీమా చేయక తప్పలేదు

Eha Tv

Eha Tv

Next Story