జస్టిస్ హేమ కమిటీ(Justice Hema Committe) రిపోర్ట్ మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనాలు రేపుతున్నాయి.
జస్టిస్ హేమ కమిటీ(Justice Hema Committe) రిపోర్ట్ మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనాలు రేపుతున్నాయి. నివేదిక వెలుగులోకి వచ్చిన తర్వాత పలువురు దర్శకులు, నటులపై లైంగిక వేధింపుల(Sexual harrasment) ఆరోపణలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. మహిళలు తమకు ఎదురైన చేదు అనుభవాలను ధైర్యంగా చెబుతున్నారు. ఈ వివాదంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA)కు అధ్యక్షుడు మోహన్‌లాల్‌తో(mohan lal) పాటు 17 మంది సభ్యులు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలపై నటి పార్వతి తిరువోతు(Parvathi thiruvothu) తీవ్రంగా మండిపడ్డారు. ఎగ్జిక్యూటివ్ ప్యానెల్ మూకుమ్మడి రాజీనామా చేయడాన్ని పిరికిపంద చర్యలా ఆమె అభివర్ణించారు. ఫిల్మ్ అసోసియేషన్‌లో నిరంకుశ పాలన నడుస్తోందని ఆరోపించారు.. అయితే తమకు మాట్లాడే అవకాశం లేకపోవడంతో సంతోషంగా అసోసియేషన్‌కు రాజీనామా చేశానని పార్వతి తెలిపారు. మీడియాతో మాట్లాడే బాధ్యత నుంచి తప్పుకోవడం పిరికితనంగా అనిపించిందని పార్వతి అన్నారు. ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మహిళలు ఫిర్యాదు చేస్తే పేర్లతో రావాలని చెప్పడేమిటని, దీన్ని బట్టి వారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందని అన్నారు. పేర్లు చెప్పడం ముఖ్యమా? ఆ మహిళకు న్యాయం జరగడమా? అనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు పార్వతి తిరువోతు.