బెంగళూరులో(bangalore) జన్మించిన నటి మనీషా యాదవ్‌(Manisha Yadav) తమిళంలో బాగా పాపులరయ్యారు. బాలాజీ శక్తివేల్‌(Balaji Shaktivel) దర్శకత్వంలో వచ్చిన వళక్కు ఎన్‌ 18/9(Valakku EN 18/9) చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తూనీగా తూనీగా(Tuniga Tuniga) అనే తెలుగు సినిమాలో కూడా నటించారు మనీషా. అందంతో పాటు అభినయమూ ఉండటంతో ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అధలాల్‌ కాదల్‌ సీవీర్‌, జన్నాల్ ఓరం, త్రిష ఇల్లానా నయనతార, ఒరు కుప్పై కథై వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శీను రామసామి(Srinu Ramaswamy) దర్శకత్వంలో వచ్చిన ఇదమ్‌ పొరుల్ యావళ్‌ సినిమాలో హీరోయిన్‌గా మనీషా యాదవ్‌ను ఎంపిక చేసినప్పటికీ అనూహ్యంగా, అకారణంగా ఆమెను సినిమా నుంచి తప్పించారు.

బెంగళూరులో(bangalore) జన్మించిన నటి మనీషా యాదవ్‌(Manisha Yadav) తమిళంలో బాగా పాపులరయ్యారు. బాలాజీ శక్తివేల్‌(Balaji Shaktivel) దర్శకత్వంలో వచ్చిన వళక్కు ఎన్‌ 18/9(Valakku EN 18/9) చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తూనీగా తూనీగా(Tuniga Tuniga) అనే తెలుగు సినిమాలో కూడా నటించారు మనీషా. అందంతో పాటు అభినయమూ ఉండటంతో ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అధలాల్‌ కాదల్‌ సీవీర్‌, జన్నాల్ ఓరం, త్రిష ఇల్లానా నయనతార, ఒరు కుప్పై కథై వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శీను రామసామి(Srinu Ramaswamy) దర్శకత్వంలో వచ్చిన ఇదమ్‌ పొరుల్ యావళ్‌ సినిమాలో హీరోయిన్‌గా మనీషా యాదవ్‌ను ఎంపిక చేసినప్పటికీ అనూహ్యంగా, అకారణంగా ఆమెను సినిమా నుంచి తప్పించారు. ఆమె సహకరించడం లేదని, తనను ఇబ్బందులు పెట్టిందన్నది దర్శకుడి వాదన. కానీ జరిగింది వేరే! ఇదమ్‌ పొరుల్ యావల్ సినిమా సమయంలో మనీషా యాదవ్‌పై దర్శకుడు శీను రామస్వామి లైంగిక వేధింపులకు(Sexual Harrasment) పాల్పడ్డాడట! ఆమె స్థానంలో నందితా శ్వేతను(Nandhitha shwetha) సినిమాలో తీసుకున్నారు. ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాన్నాళ్లయింది కానీ ఇంకా విడుదల కాలేదు. అయితే మనీషా యాదవ్‌ మరోసారి శీను రామసామి చిత్రంలో నటించనున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను మనీషా ఖండించారు. అలాంటి వారితో సినిమాలు చేసే ప్రసక్తే లేదని అన్నారు. కొద్ది రోజుల కిందట శీను రామసామి ఆఫీసు నుంచి తనకు కాల్‌ వచ్చిందని, ఆయన కొత్త సినిమాలో నటిస్తావా అని అడిగారని, తాను ఆ సినిమాలో నటించనని మొహం మీదే చెప్పేశానని మనీషా అన్నారు. 'ఇదమ్‌ పొరుల్ యేవల్ సినిమా షూటింగ్‌ సమయంలో అతను ప్రవర్తించిన తీరు చాలా దారుణంగా ఉంది. తప్పుడు ఉద్దేశంతో చాలాసార్లు సన్నిహితంగా ఉండాలని ప్రయత్నించాడు. కానీ నేను అతని కోరికలను అంగీకరించలేదు. అందుకే నన్ను సినిమా నుంచి తప్పించాడు. నాపై తప్పుడు ప్రచారం చేశాడు. నాకు నటించడం తెలియదని సినీ పరిశ్రమలో దుష్ప్రచారం చేశాడు' అని మనీషా చెప్పుకొచ్చారు. తాను పెద్ద పెద్ద దర్శకులతోనే చాలా చిత్రాలు చేశానని, అయితే ప్రతిభ ఉన్నా ఇలాంటి సంస్కారం లేని దర్శకుల సినిమాలలో నటించాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు. 'ఒరు కుప్ప కథై' ఆడియో లాంఛ్‌ కార్యక్రమంలో అందరిలాగే మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు తెలిపానని, అంతే కానీ ఆయన సినిమాలో నటించడం జన్మలో కుదరదని అన్నారు. . తనకు మంచి భర్త, కుటుంబం, స్నేహితులు ఉన్నారని నటి మనీషా యాదవ్‌ పేర్కొంది. నాలాంటి కొత్త హీరోయిన్‌లకు ఇలాంటి చేదు అనుభవాలు ఎప్పుడూ ఎదురు కాకూడదని మనీషా యాదవ్‌ తెలిపారు.

Updated On 1 Dec 2023 7:18 AM GMT
Ehatv

Ehatv

Next Story