సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటి లక్ష్మికా సజీవన్(Lakshmika Sajeevan )కన్నుమూశారు. కేలం 27 ఏళ్లకే ఆమెకు నిండునూరేళ్లు నిండిపోయాయి. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న లక్ష్మికా గుండెపోటుతో కన్నుమూశారు. ఈ వార్త మలయాళ చిత్ర పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.

Lakshmika Sajeevan Passes Away
సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటి లక్ష్మికా సజీవన్(Lakshmika Sajeevan )కన్నుమూశారు. కేలం 27 ఏళ్లకే ఆమెకు నిండునూరేళ్లు నిండిపోయాయి. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న లక్ష్మికా గుండెపోటుతో కన్నుమూశారు. ఈ వార్త మలయాళ చిత్ర పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. అజు అజీష్ దర్శకత్వం వహించిన కాక్క షార్ట్ ఫిల్మ్‌లో పంచమిగా నటించిన లక్ష‍్మిక ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. తర్వాత పంచవర్ణతతా, సౌదీ వెలక్కా, పూజయమ్య, ఉయరే, ఒరు కుట్టనాదన్ బ్లాక్, నిత్యహరిత నాయకగన్ వంటి సినిమాల్లో నటించారు. దుల్కర్ సల్మాన్ నటించిన ఒరు యమందన్ సినిమా ఆమెకు మంచి తెచ్చింది.
