సినీ పరిశ్రమలో తారులు వరుసగా నేలరాలుతున్నారు. ఈ రెండు మూడేళ్లలో ఫిల్మ్ ఇండస్ట్రీలో(Film Industry) మరణాలు చాలా ఎక్కవగా చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది తారలు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. టాలీవుడ్ లో ఒకప్పటి తారలు వరుసగా మరణిస్తుంటేు.. తమిళ, మలయాళ పరిశ్రమ నుంచి యంగ్ స్టార్స్ ఎక్కువగా అనుమానస్పందంగా మృతి చెందుతున్నారు. తాజాగా మాలయాళం నుంచి ఓ స్టార్ నటుడు మరణించాడు.
వరుస మరణాలు ఫిల్మ్ ఇండస్ట్రీని కలవరపెడుతున్నాయి. ఎంతో మంది సినీతారలు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. తాజాగా ఓ మలయాళ నటుడు అనుమానాస్పద మృతి పరిశ్రమను ఉలిక్కి పడేలా చేసింది.
సినీ పరిశ్రమలో తారులు వరుసగా నేలరాలుతున్నారు. ఈ రెండు మూడేళ్లలో ఫిల్మ్ ఇండస్ట్రీలో(Film Industry) మరణాలు చాలా ఎక్కవగా చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది తారలు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. టాలీవుడ్ లో ఒకప్పటి తారలు వరుసగా మరణిస్తుంటేు.. తమిళ, మలయాళ పరిశ్రమ నుంచి యంగ్ స్టార్స్ ఎక్కువగా అనుమానస్పందంగా మృతి చెందుతున్నారు. తాజాగా మాలయాళం నుంచి ఓ స్టార్ నటుడు మరణించాడు.
మలయాళ నటుడు వినోద్ థామస్(Vinod Thomas) అనుమానస్పదంగా మరణించడంత(Death) సంచలనంగా మారింది. మాలీవుడ్ ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. ఎలా మరణించాడో తెలియని స్థితిలో.. ఒక కారులో(Car) మృతదేహం దొరకడంతో పోలీసులు విచారణ మొదలెట్టారు. కేరళలోని కొట్టాయం(Kottayam) జిల్లా పాంపడి ప్రాంతంలోని ఓ హోటల్ సిబ్బంది తమ హోటల్ పరిసరాల్లో కారులో ఓ వ్యక్తి చాలాసేపు చలనం లేకుండా ఉండిపోవడం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, వినోద్ మరణం గురించి వెలుగులోకి వచ్చింది.
కారులో విగతజీవిగా పడి ఉన్న నటుడు వినోధ్ థామస్ ను గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాంరు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు అని స్థానిక పోలీసులు తెలిపారు. వినోద్ మరణానికి గల కారణమేంటో ఇంకా తెలియరాలేదు. కారు ఏసీలోని విషపూరిత వాయువు పీల్చడంతో అతడు మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం తరువాతే వినోద్ మరణానికి గల కారణం తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు. మలయాళంలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు వినోద్. హ్యాపీ వెడ్డింగ్, జూన్ వంటి సినిమాలో వినోద్ థామస్ నటన అతన్ని ఇండస్ట్రీలో నిలబెట్టింది.