ప్రముఖ మలయాళ బుల్లితెర నటి రెంజూష మీనన్(Renjusha Menon) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరువనంతపురంలో శ్రీకార్యం ప్రాంతంలో తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించారు. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.

Renjusha Menon Passes Away
ప్రముఖ మలయాళ బుల్లితెర నటి రెంజూష మీనన్(Renjusha Menon) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరువనంతపురంలో శ్రీకార్యం ప్రాంతంలో తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించారు. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. రెంజూష ఆత్మహత్య విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి చెందారు. సంతాపం తెలుపుతున్నారు. మలయాళ టెలివిజన్ సీరియస్ స్త్రీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు రెంజూష మీనన్. తర్వాత ఆమె అనేక చిత్రాలలో నటించారు. తన భర్తతో కలిసి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. అయితే ఆమె మరణానికి కొన్ని గంటల ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో రీల్స్ చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. ఇదిలా ఉంటే ప్రస్తుత ఆమె తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుస్తోంది. అప్పుల బాధతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని అనుకుంటున్నారు. ఆమె సినిమాల్లోనూ నటించారు. కొచ్చికి చెందిన రెంజూషా మొదట యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. నిజలాట్టం, మగలుడే అమ్మ, బాలామణి వంటి సీరియల్స్‌లో నటించారు. సిటీ ఆఫ్ గాడ్, మెరిక్కుండోరు కుంజడు అనే సినిమాల్లో నటించారు.
