మలయాళ నటుడు కుందర జానీ మంగళవారం కొల్లంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 71 ఏళ్లు. నివేదికల ప్రకారం..

Malayalam actor Kundara Johny dies of cardiac arrest at 71 in Kerala
మలయాళ నటుడు(Malayalam Actor) కుందర జానీ(Kundara Johny) మంగళవారం కొల్లంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 71 ఏళ్లు. నివేదికల ప్రకారం.. జానీకి గుండెపోటు(Heart Attck) రావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
కుందర జానీ మలయాళ సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలు పోషించిఉర్తింపు పొందారు. ఆయన చివరి చిత్రం 'మెప్పడియాన్'. ఇది 2022లో విడుదలైంది. జానీ మరణవార్త తెలిసిన ఆయన అభిమానులు సోషల్ మీడియా(Social Media) వేదికగా సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
1979లో కుందర జానీ తన 20వ ఏట సినీ అరంగేట్రం చేశాడు. అగ్నిపర్వతం, నిత్య వసంతం, రాజావింటే మకన్, ఆవనాజి సినిమాలలో పోషించిన పాత్రలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి. నాడోడిక్కట్టు సినిమాలో ఆయన పోషించిన నంబియార్ పాత్ర ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన.. ఒరు సీబీఐ డైరీ కురిప్పు, కిరీడం, చెంకోల్, స్పదికం వంటి విజయవంతమైన సినిమాలలో నటించారు.
