✕
మాళవిక మోహనన్.. చేసిన సినిమాలు చాలా తక్కువే! అందులో స్టార్ హీరోలతో చేసిన సినిమాలు మరీ తక్కువ. సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా పేటలో నటించారు. ఆ మధ్య దళపతి విజయ్ హీరోగా, దర్శకుడు లోకేశ్ కనకరాజ్ రూపొందించిన మాస్టర్ చిత్రంతో చక్కటి గుర్తింపు పొందారు. తెలుగులో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయకపోయినా తెలుగునాట ఆమె అభిమానులు చాలా మందే ఉన్నారు.

x
Malavika Mohanan
-
- మాళవిక మోహనన్(Malavika Mohanan).. చేసిన సినిమాలు చాలా తక్కువే! అందులో స్టార్ హీరోలతో చేసిన సినిమాలు మరీ తక్కువ. సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) సినిమా పేటలో నటించారు. ఆ మధ్య దళపతి విజయ్(Vijay thalapathy) హీరోగా, దర్శకుడు లోకేశ్ కనకరాజ్ రూపొందించిన మాస్టర్ చిత్రంతో చక్కటి గుర్తింపు పొందారు. తెలుగులో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయకపోయినా తెలుగునాట ఆమె అభిమానులు చాలా మందే ఉన్నారు. అందుకు కారణం సోషల్ మీడియాలో(Social media) మాళవిక చాలా యాక్టివ్‌గా ఉండటమే!
-
- ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాలలో నటిస్తున్న మాళవిక వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో తాజాగా కొన్ని ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండతో(Vijay devarkonda) కలిసి నటించాలనే కోరికను వెలిబుచ్చిన మళవిక అతడితో ఓ రొమాంటిక్ కామెడీ సినిమా చేయాలని ఉందని చెప్పారు. చిత్రమేమిటంటే విజయ్ దేవరకొండతో మాళవిక ఓ సినిమా చేయాల్సి ఉండింది. పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఆ సినిమా కొంత వరకు షూటింగ్ కూడా జరుపుకుని ఆగిపోయింది.
-
- యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి రూపొందిస్తున్న రాజా డీలక్స్‌లో మాళవిక నటిస్తున్నారు. తెలుగులో మొదటి సినిమానే ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్‌తో నటించడం విశేషం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. హార్రర్ జానర్లో వస్తున్న ఈ సినిమాపై మాళవిక ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాపై ఆంచనాలు కూడా ఎక్కువే ఉన్నాయి.
-
- అందాల భామ మాళవిక మోహనన్ ఇప్పుడు అవకాశాలు వరుసగా వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలు కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతాయి. ఆమె అందాల ఆరబోతకు అందరూ షాక్ అవుతున్నారు. స్టన్నింగ్ ఫిగర్‌తో హాట్ ఫోటో షూట్లు చేస్తూ ట్రెండింగ్ అవుతున్నారు మాళవిక మోహనన్.
-
- 2013లో వచ్చిన పట్టాంపోలె అనే మలయాళ సినిమాతో మాళవిక ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వ్యక్తిగత విషయాలతో కూడా ఆమె వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య మాళవిక హిందీ హీరో విక్కీ కౌశల్‌తో ప్రేమలో ఉన్నట్లు టాక్ వచ్చింది. ఇప్పుడా ఛాన్స్ లేదులేండి. కత్రినా కైఫ్‌ను విక్కీ కౌశల్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే కదా!

Ehatv
Next Story